OTT Movie Release: కాలం గడుస్తున్న కొద్దీ OTTల ట్రెండ్ వేగంగా పెరిగుతోంది. ఇప్పుడు ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన తర్వాత త్వరలో ఓటీటీలో విడుదల అవ్వబోతున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం దక్షిణ చిత్ర పరిశ్రమ చాలా కాలంగా మంచి చిత్రాలను నిర్మిస్తోంది. ఇటీవల విడుదలై సౌత్ ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశమైన మూడు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. SS రాజమౌళి నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'RRR', హిరో విజయ్ నటించిన 'బీస్ట్‌', చిరంజీవి, రామ్ చరణ్‌లు నటించిన 'ఆచార్య',  OTT లో విడుదల కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజయ్ దేవగన్, అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'RRR' బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలో రూ.767.54 కోట్లు వసూలు చేసింది. కాగా 'బీస్ట్' రూ.8.6 కోట్లు, 'ఆచార్య' రూ.54.74 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలను  థియేటర్లలో చూడలేకపోయినట్లైతే ఇప్పుడు ఓటీటీ చూసే అవకాశం ఉంది.


విజయ్, పూజా హెగ్డే నటించిన తమిళ చిత్రం 'బీస్ట్' ఇప్పుడు థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. మే 11న ఐదు భాషల్లో బీస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకువస్తున్నట్లు మే 4న సోషల్ మీడియాలో వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌లో 'ది బీస్ట్' మే 11న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.


ఇటీవల విడుదలైన ఆచార్య చిత్రం కూడా సినిమా తెరపై సందడి చేసిన తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. రామ్ చరణ్, చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 27న విడుదల కాబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ ఇంటర్నెట్‌ వేదికగా వెల్లడించింది.  


బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అని నిరూపించుకున్న తర్వాత ఇప్పుడు 'RRR' ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో Zee5 లో విడుదల కానుంది. అంతే కాకుండా హిందీ మాట్లాడే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడవచ్చు.


Also Read: Funny Video: దొంగల్లో వీడో ఓ వెరైటీ..పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌


Also Read: Pragya Jaiswal Photos: డిజైనింగ్ డ్రస్సులో పార్టీకి సిద్ధమైన బాలయ్య హీరోయిన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook