Funny Video: దొంగల్లో వీడో ఓ వెరైటీ..పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌

Funny Video: ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం చూశారా..? అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి. ఫోటో తీస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా డబ్బులు వసూలు చేయడం వీడియోలో ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 04:08 PM IST
  • పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌
  • సోషల్‌ మీడియాలో వైరల్‌వుతున్న ఫోటోగ్రాఫర్‌ తీరు
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ షార్ట్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్
Funny Video: దొంగల్లో వీడో ఓ వెరైటీ..పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌

Funny Video: ఫోటోగ్రాఫర్ దొంగతనం చేయడం చూశారా..? అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి. ఫోటో తీస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా డబ్బులు వసూలు చేయడం వీడియోలో ఉంది.

పెళ్లిళ్ల సీజన్‌లో సాధారణంగా వధూవరుల వీడియోలు మాత్రమే వైరల్ అవుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ఓ ఫోటోగ్రాఫర్ చర్చనీయాంశం అవుతున్నాడు. పెళ్లిలో అందరి ముందు ఫోటోగ్రాఫర్ చేసిన పని చాలా ఫన్నీగా..ఆశ్చర్యంగా ఉంది. ఫోటోగ్రాఫర్ చేసిన చిలిపి చేష్టలు నెటిజన్లకు బాగా నచ్చుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో, ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాననే నెపంతో దొంగిలించడం కనిపిస్తుంది. కానీ దొంగతనంలో విజయం సాధించలేకపోయాడు. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ దొంగతనం చేశాడని గుర్తు పట్టారు అక్కడ ఉన్న పెళ్లి కుటుంబ సభ్యులు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక వీడియో మరింత వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఫోటోగ్రాఫర్ సరదాగా దొంగతనం చేస్తూ కనిపించాడు. ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ మొదట పని చేయడం వీడియోలో చూడవచ్చు. తర్వాత మెల్లగా పూజా ప్లేటు దగ్గరికి చేయి చేరుతుంది. ప్లేట్ దగ్గరికి చేరిన తరువాత, అతను హడావిడిగా డబ్బు తీసుకొని తిరిగి రావడం ప్రారంభించాడు. పూజా ప్లేట్ దగ్గర కూర్చున్న వధువు అతను ఇలా చేయడం చూసి నవ్వడం ప్రారంభించింది. వధువు..ఫోటోగ్రాఫర్ ఇలా చేయడం చూసి, అక్కడ ఉన్న వారందరికీ ఫోటోగ్రాఫర్ తెలివి తేటల గురించి తెలిసి అందరూ నవ్వడం ప్రారంభించారు. మీరు కూడా ఈ ఫన్నీ వీడియో చూడండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Crafty Chandu (@crafty_chandu)

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్..యూట్యూబ్ షార్ట్‌తో సహా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజలు వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 85 లక్షలకు పైగా వీక్షించారు. అలాగే ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. కామెంట్‌ సెక్షన్‌లో నెటిజన్లు నవ్వుతున్న ఎమోజీలను పంచుకోవడం కనిపిస్తుంది.

Also Read: Kuber Mantra: కుబేరుడి మంత్రం ప్రతి రోజు జపిస్తే మీకు ప్రతి రోజు డబ్బుల వర్షమే..

Also Read: Ganga Saptami: గంగా జలం ఇంట్లో ఉంచే ముందు నియమాలు తెలుసుకోండి..అనేక కష్టాలు తొలగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News