OTT Movies: కరోనా మహమ్మారి సమయం నుంచి ఓటీటీలకు బాగా క్రేజ్ పెరిగింది. నచ్చిన కంటెంట్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు ఆదరణ పెరిగింది. అందుకే వెబ్ సిరీస్‌లకు తోడుగా ప్రతి సినిమా థియేటర్ విడుదలతో పాటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వారం థియేటర్ విడుదల సినిమాలు పెద్దగా లేవు. తమిళ స్టార్ దనుష్ నటించిన రాయన్, టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు వంటి 2-3 సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదల కానున్నాయి. కానీ ఓటీటీలో మాత్రం మంచి సినిమాలున్నాయి. గెటప్ శీను నటించిన కామెడీ సినిమా రాజు యాదవ్ ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. ఇక మనోజ్ బాజ్ పాయ్ నటించిన భయ్యాజీ, అవికా గోర్ హర్రర్ సినిమా బ్లడీ ఇష్క్, కా్ వంటి సినిమాలున్నాయి.


నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ 


జూలై 25 క్లియో సీజన్ 2 జర్మన్ వెబ్ సిరీస్‌, ద డెకమెరన్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌, టోక్యో స్విండ్లర్స్ జపనీస్ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక జూలై 26న ఎలైట్ సీజన్ 8 ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌, ఘోస్ట్ బ్లస్టర్స్ ఇంగ్లీషు సినిమా, ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 ఇంగ్లీషు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. 


ఆహాలో..


జూలై 23న తమిళ సినిమా కాళ్, గ్రాండ్ మా విడుదల కానున్నాయి. ఇక జూలై 24వ తేదీన తెలుగు సినిమా రాజు యాదవ్ స్ట్రీమింగ్ కానుంది


అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 25న ద మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మేన్లీ వార్ ఫేర్ సినిమా విడుదల కానుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూలై 26న బ్లడీ ఇష్క్ హిందీ సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. అదే రోజు తమిళ వెబ్ సిరీస్‌ చట్నీ సాంబార్ స్ట్రీమింగ్ కానుంది. 


ఇక జీ5లో జూలై 26వ తేదీన హిందీ సినిమా భయ్యాజీ, చల్తే రహే జిందగీ విడుదల కానున్నాయి. జియో సినిమాలో విచ్ బ్రింగ్స్ టు మీట్ యూ ఇంగ్లీష్ సినిమా జూలై 2వ తదీన విడుదలవుతోంది. ఇవి కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లేదా సినిమాలు అప్పటికప్పుడు స్ట్రీమింగ్ కావచ్చు.


Also read: Pushpa 2 Vs Game Changer: ముదరనున్న రామ్ చరణ్-అల్లు అర్జున్ రచ్చ.. గెలిచేది ఎవరు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook