Telugu OTT Releases: రెండు వారాల ముచ్చట.. ధియేటర్ లు ఎందుకు దండగ !
Telugu Latest Releases: ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే.mmచిన్న సినిమాలు, ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలయ్యి.. రెండు వారాలు తిరగకముందే.. ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఆ మాత్రం దానికి ధియేటర్ లు ఎందుకు దండగ అంటున్నారు.. సినిమా లవర్స్.. బోలెడంత ఖర్చు పెట్టి ధియేటర్ కి వెళ్ళే బదులు.. ఓటిటి బెటర్ అని ఫ్యాన్స్ ఆందోళన..
Latest OTT releases: కరోనా తర్వాత ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మీద క్రేజ్ బాగా పెరిగిపోయింది.. అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది ప్రేక్షకులు థియేటర్ల దాకా వచ్చి.. సినిమాని చూడడానికి ఆసక్తి కూడా చూపించడం లేదు. సినిమా చాలా బాగుంది.. అని మంచి హిట్ టాక్ రావాలి.. లేదా కనీసం స్టార్ హీరో సినిమా అయినా అయ్యుండాలి. ఈ రెండూ కాకపోతే.. సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు.. నమోదు చేసుకోలేకపోతున్నాయి.
ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కనీసం ప్రేక్షకులకి సినిమాని థియేటర్లు దాకా వెళ్లి చూడాలి.. అన్న ఆసక్తి కూడా కల్పించడం లేదు. విడుదలైన రెండు వారాలకే సినిమా ఓటిటిలో వచ్చేస్తుంటే ఎవరు మాత్రం.. థియేటర్ల దాకా వెళ్లి సినిమాని చూడాలని అనుకుంటారు.
ఒకవైపు నిర్మాతలు మాత్రం సినిమా కోసం చాలా కష్టపడ్డామని, కచ్చితంగా అందరూ థియేటర్లకి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని.. బోలెడు కబుర్లు చెబుతూ ఉంటారు, కానీ మళ్ళీ వాళ్లే.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కి సినిమాలను ఇచ్చి రెండు వారాల్లో విడుదల చేసేస్తూ ఉంటారు. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా.. నటించిన కృష్ణమ్మ సినిమా విడుదలై కనీసం 20 రోజులు కూడా దాటకుండానే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ప్రత్యక్షమైపోయింది.
సరే చిన్న సినిమా అని కొట్టి పారేసినప్పటికీ మరోవైపు విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా.. పరిస్థితి కూడా అలాగే అయింది. ఇక నిన్నగాక మొన్న విశ్వక్ సేన్ హీరోగా వచ్చినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా విడుదలై 14 రోజులు కాకముందే ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో రానుంది.
చాలా వరకు నిర్మాతలు తాము పెట్టిన డబ్బులు త్వరగా వెనక్కి రావాలి అన్న ఉద్దేశంతో తమ సినిమాని ఓటీటీలలోకి తోసేస్తున్నారు. నాగ వంశీ, దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు.. కూడా ఇదే పని చేస్తున్నారు. సినిమా విడుదలైన ఏడు వారాల దాకా ఓటీటీలో వేయకూడదని రూల్స్ కూడా వాళ్లే పెడతారు. వాటిని బ్రేక్ చేస్తూ రెండు వారాల్లోనే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కి తమ సినిమాని వాళ్లే ఇచ్చేస్తూ ఉంటారు. మళ్లీ వాళ్లే వచ్చి చిన్న సినిమాలను కాపాడాలని, ప్రేక్షకులు థియేటర్లకు రావాలి అని డైలాగ్ లు మాత్రం చెబుతారు.
సినిమా ఫ్లాప్ అయితే వారంలో.. లేదా యావరేజ్ అయితే రెండు వారాలలో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇలాగే కొనసాగుతూ ఉంటే స్టార్ హీరో.. సినిమాలు తప్ప మరెవరి సినిమాలు థియేటర్లలో విడుదల అవ్వకుండా డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోనే విడుదల అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter