Gopichand's Pakka Commercial movie first day Collections: 'మ్యాచో స్టార్' గోపిచంద్‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి కాంబోలో తెరకెక్కిన సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'. యూవీ క్ర‌యేష‌న్స్‌, జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై బ‌న్నివాస్‌, వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అందాల బ్యూటీ రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా నటించారు.  విలక్షణ సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మారుతి.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 1న విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం సినిమాకు కలిసొచ్చింది. మరోవైపు గోపిచంద్‌ యాక్షన్‌ సీన్స్, రాశీ ఖన్నా గ్లామర్‌, మారుతి మార్క్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో తొలి రోజు ఈ సినిమా బాక్సాఫీక్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.6.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయట.



ఈ వారం పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోడంతో.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వీకెండ్‌లో భారి కలెక్షన్స్‌ సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా సరైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపిచంద్‌కి ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, అన‌సూయ‌ భరద్వాజ్, రావు ర‌మేష్, శ్రీనివాస్ రెడ్డి కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా టిక్కెట్ రేట్లు సాధరణంగా ఉన్న విషయం తెలిసిందే. 


Also Read: Ram Charan New Look: వైరల్ అయిన రామ్ చరణ్ నయా లుక్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!


Also Read: Rishabh Pant Century: రిషబ్ పంత్‌ సూపర్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్‌ సంబరాలు! ఇదే మొదటిసారి సుమీ


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook