Ram Charan New Look: వైరల్ అయిన రామ్ చరణ్ నయా లుక్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!

Ram Charan new look from RC15 goes viral. RC15 సినిమా షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ మేకప్ వేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 02:32 PM IST
  • రామ్ చరణ్ నయా లుక్
  • పండగ చేసుకుంటున్న ఫాన్స్
  • హీరోయిన్‌గా కియారా అద్వానీ
Ram Charan New Look: వైరల్ అయిన రామ్ చరణ్ నయా లుక్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!

Hero Ram Charan new look from RC15 goes viral: 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ తేజ్ ఇటీవల నటించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించిన చ‌ర‌ణ్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఎంజాయ్ చేసిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. #RC15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలోని చ‌ర‌ణ్ లుక్‌ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న RC15 షూటింగ్ అమృత్‌స‌ర్‌లో జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చరణ్ మేకప్ వేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చ‌ర‌ణ్ గడ్డంతో స్టైయిల్ హేయిర్ క‌ట్‌తో క‌నిపిస్తున్నాడు. వైట్ షర్ట్, గ్లాస్ గాగుల్స్ పెట్టుకున్న మెగా హీరో అదుర్స్ అనిపిస్తున్నాడు. కేవలం 8 సెకండ్ల ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో చుసిన మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

RC15 చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్‌, కియారా జంటగా నటించడం ఇది రెండోసారి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా దిల్‌ రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెర‌కెక్కుతుండడంతో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు త‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర, సునీల్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read: Krithi Shetty Pics: ఎల్లో డ్రెస్సులో ఏంజిల్‌లా మెరిసిపోతున్న కృతి శెట్టి.. అందంలో బేబమ్మ తర్వాతే ఎవరైనా!

Also Read: Rashi Khanna Pics: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. దాచడానికి ఇంకేముంది?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News