Rahul Dravid celebrations goes viral after Rishabh Pant smashesh century: ప్రపంచ క్రికెట్‌లో నిజమైన జెంటిల్‌మ్యాన్, శాంతపరుడు ఎవరంటే.. ప్రతి ఒక్కరు భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరే చెబుతారు. శాంతి, క్రమశిక్షణకు మారుపేరుగా ద్రవిడ్‌ను పేర్కొంటారు. ది వాల్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నించినా.. నోటితో కాకుండా తన బ్యాటింగ్‌తో సమాధానం ఇచ్చేవారు. ప్రశాంతతకు మారు పేరైన ద్రవిడ్ ఏనాడూ బౌలర్లపై దురుసుగా ప్రవర్శించలేదు. అదే సమయంలో తాను సెంచరీ చేసినా, జట్టు పెద్ద పెద్ద మ్యాచులు గెలిచినా ఎక్కువగా సంబరాలు చేసుకున్న దాఖలు లేవు. కానీ తాజాగా ద్రవిడ్ సంబరాలకు సంబదించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు (రీషెడ్యూల్డ్ టెస్టు)లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరిన సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. సెంచరీతో భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే తరహాలో ఆడుతూ ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తాచాటడంతో టీమిండియా పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఓ దశలో 150 పరుగులు అయినా చేస్తుందా అనుకున్న సమయంలో పంత్, జడేజా చలవతో భారత్ 300+ స్కోర్ చేసింది.
Rishabh Pant, you beauty! 🤩💯
Is there a more exciting Test cricketer in the modern game?! 🔥
Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z
— Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022
ఐదవ టెస్టులో రిషబ్ పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 146 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 58వ ఓవర్ మొదటి బంతికి డబుల్ తీసిన పంత్.. సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ద్రవిడ్.. ఒక్కసారిగా లేచి చప్పట్లు కొడుతూ.. చిరునవ్వులు చిందిస్తూ పంత్‌ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'ద్రవిడ్ సంబరాలు చేసుకోవడం ఇదే మొదటిసారి' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
A usually-composed Dravid overwhelmingly applauds Pant for his quick-fire yet brilliant century.
You cannot not love test cricket ❤️#INDvsENG pic.twitter.com/DqX7Bk7SxR— Raghav (@raghav2496) July 1, 2022
Magnificent inning by Pant. Congratulations. Each shot played by him was Rahul Dravid's trust and confidence for him. Eagerly waiting for those who criticised Rahul Dravid for supporting Pant.#RDTW#RahulDravid pic.twitter.com/oxMVcPzpF8
— Chaitalee (@PravinChaitalee) July 1, 2022
Also Read: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!
Also Read: Amarnath yatra 2022: అమరనాథ్ యాత్ర యెుక్క అంతుచిక్కని రహస్యాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook