Gopichand Remuneration: హీరో గోపీచంద్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరి సినిమా సీటిమార్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ లాంగ్ రన్‌లో కలెక్షన్లు తగ్గాయి. ఈసారి 'పక్కా కమర్షియల్' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్న గోపీచంద్ గట్టి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన గోపీచంద్ తన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో వెల్లడించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నితిన్-సదా హీరో హీరోయిన్లుగా, తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. తొలి సినిమా 'తొలివలపు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ తర్వాతి సినిమాకే విలన్‌ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. జయం సినిమాలో విలన్ పాత్ర చేసినందుకు గాను తాను మొదటిసారి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ సినిమాకు గాను తనకు రూ.11 వేల రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పాడు.


ఆ సినిమా దర్శకుడు తేజ లక్కీ నంబర్ 11 అని.. అందుకే తనకు కూడా రెమ్యునరేషన్‌గా రూ.11వేల చెక్‌ను చేతిలో పెట్టారని చెప్పాడు. ఆ చెక్ చూశాక.. ఆ 11 వేల పక్కన మరో సున్నా ఉంటే బాగుండేదని మనసులో అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తన ఫస్ట్ రెమ్యునరేషన్ డబ్బులను ఇంట్లో వాళ్లకు ఇచ్చానని తెలిపాడు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడైన గోపీచంద్‌.. తన ఫస్ట్ రెమ్యునరేషన్‌గా రూ.11 వేలు మాత్రమే తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.


ప్రస్తుతం రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న 'పక్కా కమర్షియల్' చిత్రం విజయం పట్ల గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ లాయర్‌గా కనిపించనున్నాడు. గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: AP SSC STUDENTS: టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు సీఎం జగన్ వరం..



 


Also Read: Constipation: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా సులభంగా ఉపశమనం పొందండి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.