Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో ఓటీటీలకు తలనొప్పి..భారీ స్థాయిలో నష్టాలు
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
OTT Platforms : గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియ సినిమాల కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లు ఎక్కువ నష్టాలు అందుకుంటున్నాయి అని సమాచారం. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా సినిమాలు తెలుగులో మాత్రమే కాగా మిగతా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ లు అవ్వడంతో ఆ సినిమాలకి ఓటీటీ లలో మంచి ఆదరణ లభించింది. కానీ ఇది అన్నీ పెద్ద సినిమాల విషయంలోనూ వర్తించదు.
కంటెంట్ బాగుంటేనే ఏ సినిమా అయినా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలదు. అంతేకాకుండా ఒక్క భాషలో సూపర్ హిట్ అయిన సినిమా మరొక భాష ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పలేం. గతంలో సినిమాలు కేవలం ఒక్క భాషలోనే విడుదలై మిగతా భాషల్లో సాటిలైట్ బిజినెస్ ఆధారంగా డబ్బింగ్ అయ్యేవి.
కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా పెరిగిపోవడంతో నిర్మాతలు చాలా వరకు సినిమాలని ఓటీటీ రైట్స్ కోసం ఎక్కువ భాషల్లో డబ్ చేస్తున్నారు. ఇక చాలామంది వాళ్ల సినిమాలను ఏకంగా పాన్ ఇండియా సినిమాల గానే విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈ కారణంగా గతంలో కంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయిపోయాయి. కానీ ఒక భాషలో సూపర్ హిట్ అయినా సినిమా మరొక భాష ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతోంది. దీంతో కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రమే ఇలాంటి సినిమాలను చూస్తూ ఉంటారు.
మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు భారీ స్థాయిలోనే జరుగుతాయి. కానీ నాన్ థియట్రికల్ బిజినెస్ పూర్తయిపోగానే చిత్ర నిర్మాతలు ప్రమోషన్ లపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం సినిమాని థియేటర్ల దాకా తీసుకువచ్చే వరకే చిత్ర బృందం ప్రమోషన్ లు చేస్తుంది. సినిమా ఓటీటీలో విడుదల అవుతున్నప్పుడు అలాంటి ప్రమోషన్లు ఏమీ ఉండవు. అసలు ఆ నిర్మాతలు వాటిని పట్టించుకోరు కూడా. దీంతో చాలామందికి ఓటిటిలో సినిమా విడుదలవుతున్న సంగతి కూడా తెలియడం లేదు.
కానీ అప్పటికే రికార్డు స్థాయిలో డబ్బులు వెచ్చించి అలాంటి ప్యాన్ ఇండియా సినిమాల రైట్స్ ను సొంతం చేసుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఈ సినిమాల కారణంగా నష్టాలు మాత్రమే అందుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా చిత్ర నిర్మాతలు మార్కెట్ ను అర్థం చేసుకొని ఓటీటీ డీల్స్ క్లోజ్ చేస్తారా లేక గతంలో లాగానే భారీ మొత్తానికి సినిమాలను అమ్ముడు చేస్తూ ఓటీటీ లకు నష్టాలు మాత్రమే కలిగిస్తారా అనేది వేచి చూడాలి.
Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్..ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook