Record Break:`రికార్డ్ బ్రేక్` మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది.. దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు..
Record Break Director Chadalavada Srinivasa Rao: సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రూట్లోనే ఈయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రికార్డ్ బ్రేక్`. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు.
Record Break Director Chadalavada Srinivasa Rao: రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడానికి రీజన్స్ ఏంటి.. ?
గతంలో హీరోలు హీరోయిన్లు తీసుకునే పారితోషకం చాలా తక్కువగా ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఈ రేంజ్‌లో లేరు. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయ్యాయి. 'బిచ్చగాడు' వంటి సినిమాను రిలీజ్ చేసిన తర్వాత కంటెంట్ ఉన్న సినిమాకు ప్రేక్షకుల ఆశీర్వాదం ఎపుడు ఉంటుందనేది ప్రూవ్ అయింది. అందుకే ప్రజల హృదయాలను గెలిచే 'రికార్డ్ బ్రేక్' వంటి సబ్జెక్ట్ కోసం ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాము.
రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ పెట్టడానికి గత కారణాలు ఏంటి.. ?
ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అలాగే శనివారం మీడియా కు వేసిన షో లో కూడా మంచి అభినందన దక్కింది. దీంతో ఈ సినిమాకి 'రికార్డ్ బ్రేక' కరెక్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచే అదే విధమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.
ఈ సినిమా క్లైమాక్స్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేసినట్టు ఉన్నారు.. ?
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఆ సీన్స్ అవసరం. కాబట్టి ఖర్చకు వెనకాడకుండా గ్రాఫిక్స్ కోసం బడ్జెట్ కేటాయించాం. అది తెరపై కనిపిస్తోంది.
ఈ సినిమాకి హీరోలను ముందే ఫిక్స్ చేసుకున్నారా.. ?
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో అంత బాడీ ఫిజిక్ ఉన్న వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు, కృష్ణంరాజు ఉంటే కరెక్ట్ గా సరిపోయేది. ఇప్పుడు వీళ్ళు ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు.
కొత్త వాళ్లపై ఇంత బడ్జెక్ రిస్క్ అనిపించలేదా?
సినిమా విడుదలయ్యాక.. ప్రజల గుండెల్లో రికార్డ్ బ్రేక్ మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాము.
ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయడానికి గల కారణాలు ఏమిటి.. ?
ఎక్కడో తెనాలిలో కర్రల వ్యాపారం చేసే వాడిని. సినీ కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకుడిగా నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు సపోర్ట్ చేయడం నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఈ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నాము.
అప్పట్లో నారాయణ మూర్తితో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమా తీశారు ఇప్పుడు రికార్డ్ బ్రేక్? ఇప్పటి జనరేషన్‌కు ఈ సినిమా నచ్చతుందా.. ?
అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య విజయవాడ. వైజాగ్ లాంటి ప్రాంతాల్లో చక్కగా నడిచింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా తనకు పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉందన్నారు.
సినిమా చూసిన మీడియా వాళ్లు సహా ఇతర ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందించారు.. ?
సినిమా చూసిన ప్రతివారు మంచి సబ్జెక్ట్ అంటూ మెచ్చుకున్నారు. ఆర్.నారాయణమూర్తి సినిమా అనుకున్న దానికంటూ మంచిగా ఉందని ప్రశంసించారు. ఈ సినిమాను ముందుగా 2 గంటల 45 నిమిషాలు వచ్చింది. తాజాగా 20 నిమిషాలు ట్రిమ్ చేయడంతో ఈ సినిమా ఎక్కడా ల్యాగ్ ఉందనే ఫీలింగ్ ఆడియన్స్‌కు రాదు.
సినిమా థియేటర్లు దొరికాయా.. ?
బిచ్చగాడు సినిమా మాదిరే ముందుగా తక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత మౌత్ టాక్‌ను బట్టి స్క్రీన్ పెంచుకుంటూ వెళాతాము. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఈ సినిమాలో మీకు హర్ట్ టచ్చింగ్ సీన్స్ ఏదైనా ఉందా.. ?
బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం కుమారుడు ఎలాంటి కష్టాలను ఫేస్ చేసాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుందనేదే ఈ సినిమ కాన్సెప్ట్. క్లైమాక్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి రూ. 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందన్నారు.
నిర్మాత, దర్శకులు మధ్య రిలేషన్ ఎలా ఉండాలి.. ?
అప్పట్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్‌కు సరైన విలువ ఇవ్వడం లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోవడానికి ఇదే పెద్ద ప్రాబ్లం.
మీ సంస్థ నుంచి మీ నుంచి బడా హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు ఆశించవచ్చా?
నేను బ్రతికుండగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేయనంటే చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.
భారీ బడ్జెట్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిది కదా?
నేను గతంలో చేసిన శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసాను. వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చునే వారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్, సదాశివరావు, కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరికీ నిర్మాతల సాధక బాధకాలు తెలుసు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచడం లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.
ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?
ఈ సినిమాతో నేను దర్శకత్వం నేర్చుకున్నాను. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తెరకెక్కిస్తాను. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.
Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook