Prabhas Comments: `రామ్ చరణ్‌తో కలిసి త్వరలోనే సినిమా చేస్తా..`: ప్రభాస్
Prabhas Comments: అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో సందడి చేశారు డార్లింగ్ ప్రభాస్, ప్రాజెక్టు కె టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కార్యయక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. చరణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Prabhas on Ramcharan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘'కల్కి 2898 ఏడీ'’ (Kalki 2898 AD). తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముందు ప్రాజెక్టు-కె అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ను ప్రతిష్ఠాత్మకమైన శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో (Comic-Con) విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెరికాలో జరుగుతోన్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ రామ్ చరణ్ గురించి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చరణ్ తనకు మంచి స్నేహితుడి అని.. ఏదో ఒక్క రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీరి కాంబినేషన్ సెట్ అయితే టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుందంటున్నారు అభిమానులు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా వచ్చే సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.
తాజాగా రిలీజైన గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఎంటీ వేరే లెవల్ అనే చెప్పాలి. యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటున్నాయి. దుష్టశక్తుల బారి నుండి ప్రజలను కాపాడే రక్షకుడిగా ప్రభాస్ నటించాడు. ఇందులో కమల్ పాత్రను రివీల్ చేయలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ సుమారు రూ.600కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: Project K Glimpse: హాలీవుడ్ రేంజ్‌లో 'ప్రాజెక్ట్ కె' ఫస్ట్ గ్లింప్స్.. టైటిల్ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook