Adikeshava Release Postponed: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'ఆదికేశవ'. నవంబర్ 10వ తేదీన ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేయగా.. తాజాగా వరల్డ్ కప్ నేపథ్యంలో వాయిదా వేశారు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా 'మ్యాడ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సితార సంస్థ నుంచి వస్తున్న చిత్రం కావడం.. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన బాణీలు ఆడియన్స్‌కు తెగ నచ్చేశాయి.'సిత్తరాల సిత్రావతి', 'హే బుజ్జి బంగారం', 'లీలమ్మో' సాంగ్స్‌కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూవీ విడుదల గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని.. టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోందన్నారు. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్ ఉన్నాయని.. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందని చెప్పారు. టీమిండియా మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో థియేటర్లలో జనాలు సందడి కనిపించడం లేదని.. అందుకే తమ సినిమాను నవంబర్ 10వ తేదీ నుంచి 24వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపారు.  


భారత్ మ్యాచ్‌ల సమయంలో సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం తాము గమనించామని చెప్పారు. త్వరలోనే సెమీ ఫైనల్స్ ఆరంభంకానున్నాయని.. టీమిండియా ఫైనల్‌కు వెళ్లి.. వరల్డ్ కప్ సాధిస్తుందని అందరిలోనూ అంచనాలు ఉన్నాయన్నారు. ఇలాంటి సమయంలో తమ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం అయిందన్నారు. చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామని.. కచ్చితంగా అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


తన తొలి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన 'ఆదికేశవ'తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ అందుకుని శ్రీలీల ఫుల్‌ జోష్ ఉంది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ యాక్టర్ జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.  


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి