Allu Aravind : భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయంలో చిత్ర డైరెక్టర్ పరశురామ్ గతంలో చేసిన కొన్ని పనుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో డైరెక్టర్ పరశురామ్ పేరు ఇండస్ట్రీలో ఒకప్పుడు మారుమ్రోగింది. 


ఆ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వకపోయినప్పటికీ టాలీవుడ్ లో స్టార్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్లో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సి ఉంది. 


కానీ ఈ సినిమా డిస్కషన్ లు జరుగుతున్నప్పుడే పరశురామ్ విజయ్ దేవరకొండ తో సినిమాని దిల్ రాజు బ్యానర్ లో ప్రకటించారు. దీంతో అల్లు అరవింద్ షాక్ అయ్యారు. దీని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టాలని అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో వద్దనుకున్నారు. 


తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ తో పరశురామ్ గొడవ పెట్టుకుంది ఇలాంటి సినిమా కోసమా అంటూ ఫ్యామిలీ స్టార్ సినిమా మీద మండిపడుతున్నారు అభిమానులు. అసలు సరైన కథ కూడా లేని ఈ సినిమా కోసం అల్లు అరవింద్ లాంటి నిర్మాతతో గొడవ పెట్టుకోవడం పరుశురామ్ చేసిన పిచ్చి పని అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 


అల్లు అరవింద్ తో మాత్రమే కాకుండా పరశురామ్, నాగ చైతన్య లకి కూడా ఇలాంటి ఒక హిస్టరీ ఉంది. గతంలో నాగ చైతన్య కి కథ చెప్పి ఒప్పించిన పరుశురామ్ ఆ సినిమాని మొదలు పెట్టకుండా మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా అవకాశం రావడంతో నాగ చైతన్య సినిమాని క్యాన్సిల్ చేసి మహేష్ బాబు సినిమాని టేకప్ చేశారు. దీంతో తన టైం వేస్ట్ చేశారు అని నాగ చైతన్య పరశురామ్ గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు. ఇలా ఇండస్ట్రీలో పేరు ఉన్న వారందరి తో ఇలా గొడవలు పడుతూ, ఇలాంటి ఫ్లాప్ సినిమాలు తీస్తే పరశురామ్ పేరు ఇండస్ట్రీ నుంచి త్వరగా మాయం అయిపోతుంది అని మరి కొందరు హెచ్చరిస్తున్నారు.


Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook