Pawan Kalyan Gundu : పవన్ కళ్యాణ్‌కు నిజంగానే గుండు కొట్టించారా?.. అసలు విషయం చెప్పిన పరిటాల శ్రీరామ్
Pawan Kalyan Gundu Issue సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విషయాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ గుండు విషయంలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది.
Pawan Kalyan Gundu : పరిటాల రవికి, చిరంజీవి భూతగాద ఏర్పడిందని, ఆ వివాదంలోకి పవన్ కళ్యాణ్ వచ్చాడని, దీంతో పరిటాల రవి తన ప్రతాపం చూపించాడని, పవన్ కళ్యాణ్‌ను ఎత్తుకెళ్లారని, గుండు కొట్టించారంటూ ఇలా అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిపై నిజానిజాలేంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడేస్తుంటారు. అయితే ఈ ప్రచారాల మీద తాజాగా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ మాట్లాడుకొచ్చాడు.
జాఫర్ ఇంటర్వ్యూలో పరిటాల శ్రీరామ్ ఈ ప్రచారాల మీద స్పందించాడు. పవన్ కళ్యాణ్ మంచి నటులు. సొసైటి పట్ల అంతో ఇంతో కన్సర్న్ ఉంది. ఓ నాయకుడు ఎదిగే సమయంలో ఇలాంటి రూమర్లు వస్తుంటాయి. అయితే ఎంతో కొంత నిజం ఉంటో పర్లేదు.. వాటిపై స్పందించొచ్చు గానీ.. అసలు అవన్నీ నిరాధారమైన ఆరోపణలే. ఆయన్ను తక్కువ చేసి చూపించడానికే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేస్తున్నారు.. ఆయనకు మాతో మంచి సంబంధాలే ఉన్నాయి.. వాళ్లు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా.. ఆయన అర్థం చేసుకోగలరు.. ఆయన్ను నెగెటివ్ చేయడానికి మాట్లాడే మాటలే తప్పా అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఇష్యూ మీద అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇకపై అయినా ఈ రూమర్లకు స్వస్తి పలుకుతారో లేదో చూడాలి. అయితే వీటిపై ఇప్పుడు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నాటి ఫోటోలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు.
రోజా కూడా అప్పట్లో బహరంగంగానే పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ.. ఈ గుండు ప్రస్థావన తెచ్చింది. ఆప్పట్లో అయితే పవన్ కళ్యాణ్ గుండు విషయం పెద్ద హాట్ టాపిక్‌గా అయిన సంగతి తెలిసిందే. అయితే మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఈ వార్తలు ప్రచురితం కాలేదు. ఎక్కడో ఏదో మూల జిల్లా ఎడిషన్లో వచ్చిందంటూ అప్పట్లో కొన్ని వార్తల క్లిప్‌ల స్క్రీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
Also Read : Hari Teja Bold Pics : ఫారిన్ వీధుల్లో హరితేజ సందడి.. పొట్టి నిక్కర్లో అందాల ప్రదర్శన
Also Read : Nandamuri Balakrishna NBK 108 : బాలయ్య కోసం తప్పని తిప్పలు.. అనిల్ రావిపూడికి ఇక చుక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook