Paruchuri Venkateswara Rao: పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై సోదరుడి రియాక్షన్...
Paruchuri Venkateswara Rao Health Condition: టాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన సోదరుడు గోపాలకృష్ణ స్పందించారు.
Paruchuri Venkateswara Rao Health Condition: టాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో చూసి చాలామంది ఆయనకేమైంది.. ఎందుకలా మారిపోయారని ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పరుచూరి వెంకటేశ్వరరావు ఆరోగ్యంపై తాజాగా ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. అన్నయ్య వెంకటేశ్వరరావు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
వైద్యుల సూచన మేరకు అన్నయ్య ప్రస్తుతం ఆహార నియమాలు పాటిస్తున్నారని చెప్పారు. 2017లో ఆస్ట్రేలియాకు వెళ్లిన సమయంలో ఆయన ఆరోగ్యం విషయంలో కొంత తేడా వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన మేదస్సు అలాగే ఉందని తెలిపారు. ఫోన్‌లో బాగానే మాట్లాడుతున్నట్లు చెప్పారు. జట్టుకు రంగు వేయట్లేదని.. అందుకే ఇటీవల వైరల్ అయిన ఫోటోలో నెరిసిన జట్టుతో కనిపించారని అన్నారు. అన్నయ్య వెంకటేశ్వరరావు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జయంత్ సి పరాన్జీని.. ఆ ఫోటో ఎందుకు షేర్ చేశావని ప్రశ్నించినట్లు తెలిపారు.
వయసు పెరిగే కొద్ది శరీర ధర్మాలు మారుతుంటాయని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తాను కూడా 10 కిలోలు తగ్గానని.. అయితే తాను 80 నుంచి 70కి తగ్గడంతో దాని ఎఫెక్ట్ పెద్దగా కనపడలేదన్నారు. అన్నయ్య వెంకటేశ్వరరావు 70 కిలోలే ఉంటారు కాబట్టి 10 కిలోలు తగ్గేసరికి ఆయన అలా కనబడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీఆర్, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావుల ప్రస్తావన తీసుకొచ్చారు.
'కళ్ల జోడు, నెత్తిన టోపీ లేకుండా ప్రజలకు కనిపించకూడదనేది ఎంజీఆర్ కోరిక. అలాగే, శోభన్ బాబు కూడా వార్ధక్యంలోనూ ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా అలాగే మెయింటైన్ చేశారు. కానీ 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాలో వృద్ధుడిగా కనిపించారు.' అని చెప్పుకొచ్చారు. అన్నయ్య వెంకటేశ్వరరావు స్క్రీన్ ప్లే రాయడంలో మాస్టర్ అని.. ఎన్నో సినిమాలకు గొప్ప స్క్రీన్ ప్లే అందించారని అన్నారు.
Ugadi 2022 Panchangam: పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? లేదా?.. ఉగాది పంచాంగం ఏం చెబుతోందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook