Paruchuri Venkateswara rao: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Paruchuri Venkateshwara Rao: ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో వెంకటేశ్వరరావును చూసి చాలామంది షాక్ అవుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 02:09 PM IST
  • వైరల్ అవుతోన్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో
  • గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రచయిత
  • ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేసిన దర్శకుడు జయంత్ పరాన్జీ
Paruchuri Venkateswara rao: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Paruchuri Venkateshwara rao Viral Photo: ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో వెంకటేశ్వరరావును చూసి చాలామంది షాక్ అవుతున్నారు. వెంకటేశ్వరరావు ఇంతలా గుర్తుపట్టరాకుండా మారిపోయారేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వయోభారంతో బాధపడుతున్న వెంకటేశ్వరరావు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ పరచూరి వెంకటేశ్వరరావును కలిసిన సందర్బంగా ఆయనతో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

'గురూజీని కలిశాను. వృద్ధాప్యంలో ఉన్న ఆయన్ను చూసి కొంచెం బాధ కలిగింది. కానీ ఇప్పటికీ ఆయన మైండ్ చురుగ్గా ఉంది. వెంకటేశ్వరరావు, ఆయన సోదరుడు కలిసి 300 పైచిలుకు చిత్రాలకు రచయితలుగా పనిచేశారు. ఇందులో 200 పైచిలుకు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదొక గొప్ప అచీవ్‌మెంట్.లవ్యూ సార్..' అంటూ జయంత్ సి.పరాన్జీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

కాగా, పరుచూరి వెంకటేశ్వరరావు రచయిత గానే కాదు, నటుడి గాను మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పంజా తదితర చిత్రాల్లో నటించారు. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి ఇలా బక్కచిక్కిపోయిన ఫోటో బయటకు రావడంతో పరుచూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైందని ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వరరావు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jayanth C. Paranjee (@jayanthparanji)

Also Read: Capital Punishment: సౌదీలో సంచలనం.. ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష

AP Cabinet Extension: ఏపీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి మళ్లీ ఛాన్స్, కన్నబాబుకు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News