Gaalivaana Trailer: ఆ.. కొడుకు నా కంటికి కనపడితే ఆ దేవుడు కూడా కాపాడలేడు! 'గాలివాన' ట్రైలర్‌ అదుర్స్!!

Gaalivaana Web series Trailer. ZEE5 ఓటిటిలో ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున చేతులు మీదుగా గురువారం సాయంత్రం అధికారికంగా విడుదలైంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 03:46 PM IST
  • అక్కినేని నాగార్జున చేతులు మీదుగా 'గాలివాన' ట్రైలర్‌
  • ఆ దేవుడు కూడా కాపాడలేడు
  • 'గాలివాన' ట్రైలర్‌ అదుర్స్
Gaalivaana Trailer: ఆ.. కొడుకు నా కంటికి కనపడితే ఆ దేవుడు కూడా కాపాడలేడు! 'గాలివాన' ట్రైలర్‌ అదుర్స్!!

 Gaalivaana Trailer launched by Akkineni Nagarjuna: పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుంచి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి లూజర్‌, లూజర్‌ 2 వంటి టాప్‌ నాచ్‌ సిరీస్‌ తర్వాత బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌ట్కెన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ZEE5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు.

ZEE5 ఓటిటిలో ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున చేతులు మీదుగా గురువారం సాయంత్రం అధికారికంగా విడుదలైంది. 1:39 నిముషాల నిడివి కలిగిన ఆ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. ట్రైలర్‌లోని కంటెంట్‌ను గమనిస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో పాటు 'ఆ లం.. కొడుకు నా కంటికి కనపడితే వాడ్ని నా నుంచి ఆ దేవుడు కూడా  కాపాడలేడు' అంటూ హై ఎమోషన్‌తో చెప్పిన డైలాగ్‌  సిరీసులో ప్రతీకారం అనే పాయింట్‌ కూడా ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది. 

‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ క్వాలిటీ పరంగా, విజువల్స్‌ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన క్రైం థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా క్యారీ చేసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండింగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ను  వీక్షకులకోసం ఏప్రిల్‌ 14న ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్‌ చేయడానికి ప్లాన్‌  చేస్తున్నారు.

రణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌లో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..  చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌ మరియు నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు  శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. 

Also Read: KKR vs PBKS Playing 11: కోల్‌కతాతో పంజాబ్‌ ఢీ.. నిప్పులు చెరగడానికి సిద్దమైన స్టార్ పేసర్! తుది జట్లు ఇవే!!

Also Read: Chiranjeevi Sukumar: సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి- ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News