Pathaan Joins Rs 1000 Crore Club: చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్ కి ఊపిరిలు పోసింది షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం మరో కీలక పాత్రలో నటించారు. జనవరి 25వ తేదీన అంటే క్రిందటి నెల గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాక గతంలో ఉన్న అనేక రికార్డులను సైతం బద్దలు కొడుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18 వ రోజు అంటే శనివారం నాడు ఈ సినిమా రాబట్టిన వసూళ్లతో ఏకంగా 1000 కోట్ల మార్క్ బద్దలు కొట్టింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా కాగా సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక బాలీవుడ్ ఫిలిం క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ రోహిత్ జైస్వాల్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.


ఈ విషయాన్ని రోహిత్ జైస్వాల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు అది కూడా చైనా లేకుండా అలాగే సౌత్ నుంచి అంటే డబ్బింగ్ వర్షన్స్ నుంచి పెద్దగా వసూళ్లు రాకపోయినా ఈ 1,000 కోట్ల మార్క్ అందుకోవడం అనేది ఒక రిమార్కబుల్ జర్నీ అని పేర్కొన్నారు. ఈ పఠాన్ ఇండియాలో తెరకెక్కించిన ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు.


మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల అరవై నాలుగు కోట్ల 15 లక్షలు వసూలు చేస్తే కేవలం హిందీ వర్షన్ ఒక్కటే 350 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇక రెండో రోజు నుంచి ఈ సినిమా వస్తువుల్లో వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక పఠాన్ ఇండియన్ సినీ చరిత్రలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన 5వ సినిమా గా నిలిచింది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత పఠాన్ ఐదవ సినిమాగా చేరింది. దంగల్ పూర్తి రన్ లో 2012 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 1811 కోట్లు ఆర్ఆర్ఆర్  1227 కోట్లు, కేజిఎఫ్ చాప్టర్ 2 1027 కోట్లు వసూలు చేసింది.
Also Read: Amigos Movie Day 2: అంచనాలు అందుకునేందుకు కష్టపడుతున్న అమిగోస్.. ఆ సినిమాతో పోలిస్తే దారుణంగా!


Also Read: Veera Simha Reddy OTT: వాల్తేరు వీరయ్య కంటే ముందే ఓటీటీలోకి వీర సింహా రెడ్డి.. ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook