Pavitra Lokesh: నరేష్ తో సహజీవనం.. కృష్ణతో కలిసే.. మొదటి పెళ్లిపై పవిత్ర లోకేష్ సంచలనం
Pavitra Lokesh opens up: నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద పవిత్ర లోకేష్ అసలు ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు.
Pavitra Lokesh opens up on Naresh live in :ఈ మధ్య కాలంలో నటి పవిత్ర లోకేష్, నటుడు నరేష్ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వారిద్దరూ మహాబలేశ్వరంలో ఒక మతాన్ని సందర్శించడంతో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే వీరి ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక కన్నడ మీడియా సంస్థ పవిత్ర లోకేష్ ను ఈ విషయం మీద వివరణ కోరింది. ఈ విషయం మీద పవిత్ర లోకేష్ ఓపెన్ అవ్వరు అనుకున్నారు కానీ ఆమె పూర్తిస్థాయిలో అసలు ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు.
నటుడు నరేష్ తో తాను సహజీవనం చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మేము వివాహం చేసుకోలేదు కానీ ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామని మా బంధానికి కృష్ణ కుటుంబం నుంచి కూడా ఆమోదం ఉందని ఆమె వెల్లడించారు. నరేష్ మారు తండ్రి అయిన కృష్ణ గారితో పాటు నరేష్ నేను కలిసి వారి ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నామని, నరేష్ కి ఇంకా మూడో భార్యతో విడాకులు కాలేదు కాబట్టి అది అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తామని అన్నారు. నరేష్ చాలా మంచి వారని చెప్పుకొచ్చిన ఆమె, అసలు ఆయన మోసం చేస్తున్నట్లు అనిపించదని, అబద్ధాలు ఆడరు ఏదైనా మొఖం మీద చెప్పేసే అలవాటు ఉండటంతో జీవితం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన నాకు తోడుంటే చాలు అన్న ఆమె అంతకు మించి ఎలాంటి డిమాండ్స్ లేవని అన్నారు.
ఇక మొదటి భర్త అంటూ ప్రచారం జరుగుతున్న సుచేంద్ర ప్రసాద్ తో కూడా తనకు వివాహం జరగలేదని ఆయనతో కూడా తాను సహజీవనమే చేశానని పవిత్ర వెల్లడించారు. పెళ్లి జరగలేదు కాబట్టి విడాకుల ప్రస్తావన కూడా అవసరం లేదని పేర్కొన్న ఆమె తాము విడిపోయాం కానీ ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులతో కూడా తాను అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటానని ఆయన వెల్లడించారు. నరేష్ భార్య రమ్య రఘుపతి గురించి పవిత్ర లోకేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆమెను కొన్నాళ్లు గమనిస్తే తనకు ఆమె గురించి అర్థం అయింది అని చెప్పుకొచ్చారు.
నరేష్ తో కలిసి ఉండడానికి ఆమె ఇష్టపడలేదని ఆమె కనుక సరిగ్గా ఉండి ఉంటే నరేష్ కుటుంబం కూడా ఆమెకు మద్దతుగా ఉండి ఉండేదని పవిత్ర లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. కన్నడనాట తండ్రి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవిత్ర లోకేష్ అక్కడ మంచి నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక నరేష్ పీఆర్ టీం కొన్ని రోజుల క్రితం స్పందించింది. నరేష్ నాలుగో వివాహం చేసుకోలేదని ఈ విషయం మీద స్పందించడానికి కూడా ఆయన ఆసక్తి చూపించడం లేదని ఒక నోట్ విడుదల చేశారు.
Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీరకట్లులోనూ అందాలని అస్సలు దాచట్లేదుగా!
Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.