Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ
Tholi Prema Movie Re Released: తొలి ప్రేమ మూవీ పాతికేళ్ల తరువాత మళ్లీ థియేటర్ల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది రచ్చ రచ్చ చేస్తున్నారు. విజయవాడలో థియేటర్ స్క్రీన్ చించివేయగా.. తిరుపతిలోని మరో థియేటర్లో చెక్క తలుపులను ధ్వంసం చేశారు.
Tholi Prema Movie Re Released: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి జంటగా.. కరుణాకరన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ తొలిప్రేమ. 25 ఏళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను నేడు మళ్లీ రీరిలీజ్ చేశారు. మొత్తం 300 థియేటర్లలో తొలిప్రేమ చిత్రం 4కే ఫార్మాట్‍లో అభిమానుల ముందుకు వచ్చింది. దీంతో సినీ ప్రేమికుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. కానీ పలుచోట్ల కొంతమంది అత్యుత్సాహంతో థియేటర్ల యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతోంది.
విజయవాడలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్ స్క్రీన్ వద్దకు వెళ్లి ఆనందంతో డ్యాన్సులు వేశారు. అయితే అదే ఊపులో థియేటర్ స్క్రీన్ చించివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్లో తొలిప్రేమ సినిమాను శుక్రవారం రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. సినిమా ప్రదర్శితమవుతన్న సమయంలో థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్ స్టెప్పులు చూసి మురిసిపోయారు. ఒకానొక సమయంలో అభిమానులు కేరింతలు ఎక్కువ కావడంతో కాసేపు సినిమా నిలిపేశారు. కొందరు అభిమానులు థియేటర్ వద్ద ఉన్న చెక్క తలుపులను ధ్వంసం చేశారు.
1998 సంవత్సరంలో వచ్చిన తొలిప్రేమ మూవీ అప్పట్లో ప్రేమకథ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్ చేసింది. 1998 జూన్ 24న ఆడియన్స్ ముందుకు రాగా.. గత శనివారానికే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇటీవల సినిమాల రీరిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోవడంతో తొలిప్రేమను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతుండగా.. అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తుతున్నాయి. 25 ఏళ్లయినా తొలి ప్రేమ మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ మూవీకి సీక్వెల్ తీయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అదేవిధంగా గబ్బర్ సింగ్ మూవీని కూడా రీరిలీజ్ చేయాలని అడుగుతున్నారు.
Also Read: Sreeleela: 'అలాంటివి చేయాల్సి వస్తే సినిమాల నుంచి తప్పుకుంటా..': శ్రీలీల
Also Read: GST Rates 2023: గుడ్‌న్యూస్.. భారీగా జీఎస్టీ తగ్గింపు.. తక్కువ ధరకే మొబైల్స్, టీవీలు ఇంకా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook