GST Rates 2023: గుడ్‌న్యూస్.. భారీగా జీఎస్టీ తగ్గింపు.. తక్కువ ధరకే మొబైల్స్, టీవీలు ఇంకా..

GST Rates on Electronic Items: ఇక నుంచి మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించింది. ఏయే రేట్లు తగ్గాయి..? ఎంత శాతం తగ్గాయి..? పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 1, 2023, 06:22 AM IST
GST Rates 2023: గుడ్‌న్యూస్.. భారీగా జీఎస్టీ తగ్గింపు.. తక్కువ ధరకే మొబైల్స్, టీవీలు ఇంకా..

GST Rates on Electronic Items: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలుపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 31.3 శాతం జీఎస్టీ ఉండగా..  18 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల, ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్లతో సహా అనేక గృహోపకరణాల రేట్లు భారీగా తగ్గనున్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గిన జీఎస్టీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. 

మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎల్‌ఈడీ బల్బులు, ఫ్రిజ్‌లు, యూపీఎస్, వాషింగ్ మెషీన్లపై జీఎస్టీ 31.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 27 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ స్క్రీన్ సైజు ఉన్న టీవీలపై 18 శాతానికి తగ్గించింది. అయితే ఎక్కువ మంది 32 ఇంచుల కంటే ఎక్కువ సైజు ఉన్న టీవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇది పెద్దగా ఉపయోగపడదు. వాటికి ఇప్పటికీ 31.3 శాతం జీఎస్టీ ఉంది. మీకు చిన్న టీవీ కావాలంటే మీరు కొంత డబ్బు ఆదా అవుతుంది. అయితే పెద్ద టీవీ కావాలంటే గతంలో మాదిరిగానే ఎక్కువ శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు తదితర వస్తువులు కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై జీఎస్టీని 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంటే ధర 12 శాతం వరకు తగ్గుతుంది. మిక్సర్‌లు, జ్యూసర్‌లు, వాక్యూమ్ క్లీనర్‌లు, ఎల్‌ఈడీలు, వాక్యూమ్ ఫ్లాస్క్‌లు, వాక్యూమ్ క్లీనర్లు వంటి వాటిపై కూడా జీఎస్టీ తగ్గింది. 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గగా.. ఎల్‌ఈడీలపై జీఎస్టీ 15 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది.

ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు రూ. 1,57,090 కోట్లు. ఇది గతేడాది ఇదే నెలలో జీఎస్టీ వసూళ్ల కంటే 12 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మే నెలలో సీజీఎస్టీకి రూ.28,411 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.35,828 కోట్లు, ఐజీఎస్టీకి రూ.81,363 కోట్లు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర అత్యధికంగా  రూ.23,536 కోట్లు జీఎస్టీ వసూలు చేసింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా అధికంగా జీఎస్టీ వసూళ్లు సాధించాయి. 

Also Read: Rajanna Sircilla Family Death: సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య  

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News