Sreeleela: 'అలాంటివి చేయాల్సి వస్తే సినిమాల నుంచి తప్పుకుంటా..': శ్రీలీల

Sreeleela: టాలీవుడ్ అగ్రకథానాయికల్లో శ్రీలీల ఒకరు. చేతి నిండా ప్రాజెక్టులతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2023, 10:34 AM IST
Sreeleela: 'అలాంటివి చేయాల్సి వస్తే సినిమాల నుంచి తప్పుకుంటా..': శ్రీలీల

Sreeleela comments Viral: చేతినిండా సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. ఈమె చేపట్టినా ప్రతి ప్రాజెక్టు హిట్ అవుతుండటంతో మేకర్స్ అందరూ ఈ బ్యూటీనే కథానాయికగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. పెళ్లిసందడి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతుంది. 

ఓ పక్క యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు సీనియర్ హీరోలతోనూ జతకడుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. ఇంకోవైపు నటసింహం బాలకృష్ట మూవీలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ మూవీ రీసెంట్ గా భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టారు. మిగతా సినిమాల విషయానికొస్తే.. మెగా హీరో వైష్ణవ్ తోపాటు ఎనర్జీటిక్ స్టార్ రామ్ తోకూడా ఓ సినిమా చేస్తుంది. గౌతమ్ తిన్ననూరి-విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఈమె హీరోయిన్. నితిన్-వక్కాంతం వంశీ సినిమాతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నట్లు సమాచారం.   

మరోవైపు శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఈ బ్యూటీ దగ్గరకు ఓ ప్రాజెక్ట్ వెళ్లిందంట. బోల్డ్ కంటెంట్ మూవీ కావడంతో దానిని చేయనని నిర్మొహమాటంగా చెప్పిందట. ''ఎంత పారితోషికం ఇచ్చినా అలాంటి సినిమాలు చేయనని.. హద్దులు దాటాల్సి వస్తే మూవీస్ నుంచి తప్పుకుంటానని.. తన వైద్య వృత్తిని కొనసాగిస్తాని'' తెగేసి చెప్పిందట ఈ అమ్మడు. తాజాగా ఈ న్యూస్ ఫిలిం సర్కిల్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: Spy OTT Platform: నిఖిల్ 'స్పై' ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News