Pawan Kalyan Appreciates Virupaksha Teaser సాయి ధరమ్ తేజ్ చివరగా రిపబ్లిక్ అనే సినిమాతో పలకరించాడు. అంతకు ముందు చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా పర్వాలేదనిపించింది. రిపబ్లిక్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా అంత వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ మూవీ రిలీజ్ టైంలోనే సాయి ధరమ్ తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌లో గాయపడ్డాడు. దీంతో ఆయన ప్రాజెక్టులన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన విరూపాక్ష సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేశారు. మార్చి 1న ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అంతకంటే ఒక రోజు ముందే ఈ టీజర్‌ను పవన్ కళ్యాణ్‌కు చూపించింది చిత్రయూనిట్. విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కళ్యాణ్‌ ఫుల్ ఖుషీ అయ్యాడు. టీజర్ బాగుందని చిత్రయూనిట్‌ను మెచ్చుకున్నాడట. మరీ ముఖ్యంగా దర్శకుడిని పొగిడేసినట్టు తెలుస్తోంది. ఇక తన సినిమా కోసం ఇలా వచ్చిన తన మీద ఇంత ప్రేమను కురిపించిన తన మామకు థాంక్స్ చెప్పాడు సాయి ధరమ్ తేజ్. థాంక్యూ కళ్యాణ్‌ మామ అంటూ ట్వీట్ వేశాడు.


పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సముద్రఖని తెరకెక్కిస్తుండగా.. స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ చూసుకున్నాడని టాక్. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు కేటాయించాడట. దాని కోసం 70, 80, 90, 100 కోట్లు తీసుకున్నాడంటూ ఎవరికి తోచినట్టుగా వాళ్లు కథలు అల్లేసుకుంటున్నారు.


 



పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు గానీ.. ఒక్క సినిమా షూటింగ్ కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోతోన్నాడని టాక్. హరి హర వీరమల్లు సినిమాను ఎప్పుడో మొదలుపెట్టేశారు. కానీ ఇంత వరకు విడుదల చేయలేకపోయారు. దాని కంటే వెనకాల ప్రారంభించిన వకీల్ సాబ్ వచ్చింది.. పోయింది. ఇక హరీష్‌ శంకర్ సినిమా, సుజిత్ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.


సాయి ధరమ్ తేజ్‌ విరూపాక్ష సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. సుకుమార్ రైటింగ్ బ్యానర్ కూడా భాగస్వామి అయింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని కార్తీక్ తెరకెక్కించాడు. కన్నడ సెన్సేషన్ అజనీష్ సంగీతాన్ని అందించడం విశేషం.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook