Power Glance out From Pawan Kalyans HariHara Veera Mallu Movie: నేడు 'పవర్‌ స్టార్' పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈరోజు ఆయన 51 పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ను అందించింది. హరి హర వీరమల్లు సినిమా నుంచి 'పవర్ గ్లాన్స్‌'ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. 'మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కి తెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు' అంటూ సాగే పాటతో వీడియో రిలీజ్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 'పవర్ గ్లాన్స్‌' వీడియోలో పవన్‌ కళ్యాణ్‌ లుక్‌, మేనరిజం చాలా చాలా పవర్‌ ఫుల్‌గా ఉన్నాయి. మల్లయోధులతో ఆయన పోరాటం చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.మొత్తానికి ఈ వీడియో ప్రతిఒక్కరికి గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. పీరియాడిక్ కథ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.



మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో హరి హర వీరమల్లు సినిమా కథ సాగుతుంది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగం సినిమా షూట్‌ పూర్తైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో పవర్‌ స్టార్ సరసన బొద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 


Also Read: Kcr New Scheme: ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ కొత్త స్కీం.. దసరా నుంచి అమలు! గులాబీ పండగేనా..


Also Read: Prakasam: అర్ధరాత్రి పెను ప్రమాదం.. లారీలో పేలిపోయిన వందల గ్యాస్ సిలిండర్లు..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook