Pawan Kalyan: రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీ..
Pawan Kalyan: ఈ మధ్య కాలంలో పాత సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎక్కువైంది. ఒకపుడు తెలుగులో పాత సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసేవారు. కొన్నిసార్లు విడుదలైనపుడు నడవని రీ రిలీజ్‌లో కుమ్ముసేవి. ఇక శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వాటి దూకుడు తగ్గింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాత ఫ్లాప్ మూవీని మరోసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Pawan Kalyan - Cameraman Gangatho Rambabu: గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో పాత సినిమాలను 4K ఫార్మాట్‌లో రీ ప్రింట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య జల్సా, ఖుషీ, ఘరానా మొగుడు, బిజినెస్ మ్యాన్, ఒక్కడు, చెన్నకేశవరెడ్డి, తొలి ప్రేమ చిత్రాలు విడుదలై మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. తాజాగా ఏపీలో ఎన్నికల వేడి రాజుకున్న ఈ వేళలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను మరోసారి రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తమన్నా కథానాయికగా నటించిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. 2012 అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే 1600పైగా స్క్రీన్స్‌లో విడుదలై సంచలనం రేపింది. ఈ చిత్రంలో రాంబాబుగా పవన్ కళ్యాణ్, కెమెరామెన్ గంగ పాత్రలో తమన్నా నటించారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదురించే ధైర్యశాలిగా గంగను అట్రాక్ట్ చేస్తాడు. రాంబాబు మాములు మెకానిక్ కంటే సమాజాన్ని బాగుచేసే మెకానిక్ పాత్ర అయిన జర్నలిస్ట్‌గా చేర్పిస్తోంది.
ఈ నేపథ్యంలో సమాజంలో జరిగే అన్యాయాలు, అరాచకాలను వారిద్దరు ఎలా ఎదుర్కొన్నారు అన్న స్టోరీ పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. మంచి కథ, కథనాలున్న ఎందుకో ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో నడవలేదు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం, శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ సినిమాను ఫిబ్రవరిలో మంచి తేదీని చూసుకుని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అప్పట్లో అంతగా నడవని ఈ మూవీ రీ రిలీజ్‌లో ఏ మేరకు కాసుల వర్షం కురిస్తుందో చూడాలి. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబుర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి