Pawan Kalyan: పిల్లలతో పవన్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్
ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్‌తో ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ క్రమంలో కొంచెం సమయం దొరికినా.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
Pawan Kalyan chills with kids - photo shared by Renu Desai: ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్‌తో ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ క్రమంలో కొంచెం సమయం దొరికినా.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు ఈ ఫొటోనే నిదర్శనం. తాజాగా రేణూ దేశాయ్ ( Renu Desai ) ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోను చూసి పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పవన్ కల్యాణ్ కూతురు ఆధ్యా (Aadhya Konidala), కొడుకు అకిరా నందన్ (Akira Nandan) తో సరదాగా దిగిన ఫొటోను రేణూదేశాయ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు రేణూ దేశాయ్ క్యాప్షన్ కూడా రాసింది.
‘‘నా ఫోన్ కెమెరాతో తీసిన అరుదైన క్షణాలకు సంబంధించిన ఫొటో. వారు మీ ఫోన్ ఫొటో ఆల్బమ్‌లల్లో ఉండని అందమైన అరుదైన క్షణాలకు సంబంధించిన స్టిల్స్‌ను మీతో పంచుకుంటున్నా’’..అంటూ రేణూ దేశాయ్ క్యాప్షన్ రాశారు. అయితే రేణూ ఈ ఫొటోకు కామెంట్స్ కనిపించకుండా డిసేబుల్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ తన పిల్లలతో కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read: Bandla Ganesh: నా దేవుడిని అంటే సహించను: బండ్ల గణేష్
తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ప్రేమించి పెళ్లి చేసుకోని.. విడిపోయినా తర్వాత కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్నారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ ఆద్య పేరుతో తెరకెక్కనున్న సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.
Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe