Mega157 director


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈమధ్య కాలంలో వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందే ఉంటుంది. వాల్తేరు వీరయ్య సినిమా తప్ప చిరంజీవి రీఎంట్రీ తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు కూడా లేవు. తాజాగా భోళా శంకర్ సినిమాతో మరొక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి.


తాజాగా ఇప్పుడు చిరంజీవి బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తో చేస్తున్న విశ్వంభర సినిమాతో బిజీ గా ఉన్నారు. మెగాస్టార్ కెరియర్ లో 156 వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.


తాజాగా ఇప్పుడు చిరంజీవి 157 వ సినిమాకి కూడా లైన్ క్లియర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్న అవాంతరాలు అన్నీ తొలగిపోయినట్టే అని, అతి త్వరలోనే సినిమా ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో బయటకు రానుందట.


నిజానికి విశ్వంభర సినిమా చిరంజీవి 157 వ సినిమా కావాల్సింది. కానీ చిరు 156 వ సినిమా కథ విషయంలో లోపించడంతో చిరంజీవి ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి విశ్వంభర సినిమాని 156 గా ముందుకు తీసుకువచ్చారు.


తాజాగా చిరంజీవి 157 వ సినిమా ఇప్పుడు రెడీ అయింది. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల స్వయంగా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ గా హరీష్ శంకర్ ను లైన్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో పెట్టారు.


కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. దీంతో మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్న హరీష్ శంకర్ అది పూర్తవ్వగానే చిరంజీవితో సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.


అందుకే మిస్టర్ బచ్చన్ షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నో లో జరుగుతుంది. జులై కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి చిరు సినిమా పై ఫోకస్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది.


Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు


Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్‌ ధ్వజం



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook