Pawan Kalyan Ustad Bhagat Singh పవన్ కళ్యాణ్‌ హరీష్‌ శంకర్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. భగవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఎంతకీ ముందుకు కదల్లేదు. మధ్యలో కొత్త సినిమాలను ఒప్పుకోవడం, వాటిని పూర్తి చేసుకోవడమే పవన్ కళ్యాణ్‌కి సరిపోయింది. పవన్ కళ్యాణ్‌ కోసం హరీష్‌ శంకర్ నాలుగైదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. మొత్తానికి హరీష్‌ శంకర్ మాత్రం ఇప్పుడు సినిమా పనుల్లో పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవదీయుడు భగత్ సింగ్ కథను పక్కన పెట్టేసి.. తేరీ రీమేక్‌ను హ్యాండిల్ చేసే బాధ్యతను హరీష్ శంకర్ భుజం మీద పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అదే సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు అంతా సిద్దం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా మైత్రీ మూవీస్ సోషల్ మీడియా ఖాతాల్లో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.


 



ఉస్తాద్ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రంగంలోకి దిగాడు. అదిరిపోయే సెట్‌ను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది తేరీ రీమేక్ గనుక అయి ఉంటే.. ఇది బేకరీ సెట్టా? పోలీస్ట్ స్టేషన్ సెట్టా? అన్నది తెలియాల్సి ఉంది. భారీ ఎత్తున ఈ సెట్‌ను నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టుగా సమాచారం.


వచ్చే వారంలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ వినోదయ సిత్తం రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. మరో వైపు హరి హర వీరమల్లు సినిమా కూడా ఉంది. అయితే ఈ ఉస్తాద్ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ ఎన్ని రోజులు డేట్స్ కేటాయించాడు.. సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను కంప్లీట్ చేస్తారా? అన్నది తెలియడం లేదు.


పవన్ కళ్యాణ్‌ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు గానీ పూర్తి చేయడంలో మాత్రం శ్రద్ద చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముందు ఒప్పుకున్న సినిమాల కంటే.. త్రివిక్రమ్ సజెస్ట్ చేసే రీమేక్‌ల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడని, అందుకే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు అంత త్వరగా పూర్తయ్యాయని కామెంట్లు వినిపిస్తుంటాయి.


Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్


Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook