Hari Hara Veera Mallu: ఎన్నో సంవత్సరాల నుంచి హరిహర వీరమల్లు సినిమా.. అలానే పడుంది. ఈ చిత్ర ప్రకటన ఎప్పుడో వచ్చింది కానీ.. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తికాలేదు. పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు సైన్ అయితే చేశారు కానీ.. తన పొలిటికల్ పనుల వల్ల షూటింగ్స్ మాత్రం జరుపుకోలేకపోయారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సైన్ చేసిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి మాత్రం అన్నిటికన్నా దారుణంగా తయారయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేసినందుకు ఈ మధ్యనే దర్శకుడు క్రిష్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక చేసేదేమీ లేక ప్రస్తుతం.. ఈ సినిమా నిర్మాత ఏ.ఏం.రత్నం.. అతని కొడుకు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు.
హరి హర వీరమల్లు సినిమా రెండు పార్టులుగా వస్తుందని, అందులో మొదటి భాగం ఈ సంవత్సరం కచ్చితంగా వస్తుందని నిర్మాత ఏ ఎం రత్నం ఈ మధ్యనే తెలియజేశారు. 


అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడల్లా ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనేటట్టు కనిపించడం లేదు. దాంతో ఇప్పటికే జరిగిన షూటింగ్, తీసిన పుటేజ్‌కు వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నారట సినిమా యూనిట్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా కానిచ్చేస్తున్నారట. 


జూన్‌లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందట. అందుకే టీం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండానే షూటింగ్ కి సంబంధించిన పనులు చేసుకుంటున్నరట . ఈ క్రమంలోనే యూనిట్ మిగిలిన కథ గురించి కూడా చర్చలు జరుపుతోందట. కానీ ఈ చర్చల్లో అయితే.. పవన్ కళ్యాణ్, క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. క్రిష్ లేకుండా ఇక హరి హర వీరమల్లు పనులు అన్నీ జరిగేలా ఉంది. చూస్తుంటే ఇకపై క్రిష్‌కు ఈ సినిమాతో అసలు ఎక్కడా సంబంధం ఉండేలా కనిపించడం లేదు.


మరి క్రిష్ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆయన లేకుండా ఎలా ముందుకు తీసుకెళ్తారు.. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తారు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఈ మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, హరీష్ శంకర్ మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.


Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?


Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter