The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించాడు. త్వరలో అతడి నిర్మాణంలో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాగా నచ్చేసింది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ స్పందించి..సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని కదిలించేదిలా ఉందని..ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అని చెప్పాడు. త్వరలో అబిషేక్ అగర్వాల్ నిర్మాణంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. 


తనను అభినందించిన పవన్ కళ్యాణ్‌ను ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ..పుష్పగుచ్ఛం అందించారు హరీష్ శంకర్ తో చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. భీమ్లానాయక్ విజయంతో ఊపు మీదున్న పవన్ కళ్యాణ్..క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న హరిహల వీరమల్లు సినిమా కోసం సిద్ధమౌతున్నాడు. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. 


ది కశ్మీర్ ఫైల్స్ సినిమా...1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపం. ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రెండవరోజు నుంచి భారీగా కలెక్షన్లు కురిపిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 250 కోట్లకు పైగా  కలెక్షన్లు చేసింది. చిన్న సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. ఇప్పుడీ సినిమాపై పపన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తున్నాడు. 


Also read; Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook