Ustaad Bhagat Singh Title Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులను త్వరగా ఫినిష్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హరి హర వీరమల్లు షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం రెండు దశాబ్దాల క్రితం పక్కన పెట్టిన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌కు పదునుపెడుతున్నారు పవర్ స్టార్. ఇటీవలె యంగ్ డైరెక్టర్ సుజీత్‌ మూవీకి సబంధించిన అప్‌డేట్ రాగా.. తాజాగా హరీష్‌ శంకర్ సినిమాకు సంబంధించి తీపి కబురు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గబ్బర్ సింగ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీకి పవన్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర సినిమాలతో ఫుల్ బిజీ కావడంతో ఇక అందరూ ఈ మూవీకి బ్రేక్ పడినట్లే అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.


'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ మరో టైటిల్‌ను అనౌన్స్ చేసింది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఉపశీర్షికను జోడించింది. ఈసారి వినోదానికి మించినదంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ను.. మరోచేతిలో టీ గ్లాస్ పట్టుకుని.. పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్యాక్‌గ్రౌండ్‌లో విద్యుత్‌ వైర్లు, కరెంట్‌ తయారు చేసే పరిశ్రమలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మెరుపుల మధ్య టైటిల్‌ను పెట్టారు.


గతంలో రిలీజ్‌ చేసిన భవదీయుడు భగత్‌ సింగ్‌ మూవీ పోస్టర్‌కు ఇది దగ్గర ఉంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆదివారం ఉదయం నిద్రవేవగానే పవన్ ఫ్యాన్స్‌కు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ టైటిల్ పోస్టర్ కనిపించడంతో సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఒక్కసారిగా పవన్‌ లుక్‌ను చూసి తెగ సంబరపడిపోతున్నారు. థెరి మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. 


Also Read: Pawan Kalyan: ట్యాక్స్ కట్టేందుకు పవన్ కళ్యాణ్‌ రూ.5 కోట్ల అప్పు.. జనసేన నేత వీడియో వైరల్  


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook