Janasena Leader Video Viral: పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటనే కోట్లాది మంది అభిమానుల్లో ఓ వైబ్రేషన్. ఆయన సినిమా థియేటర్లలోకి వస్తుందంటే నెల రోజుల ముందే నుంచే సంబురాలు మొదలు పెడతారు. సినిమాల్లో పవర్ స్టార్‌గా దూసుకెళ్తునే.. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో కొన్నిసార్లు సినిమాలకు టైమ్ కేటాయించకపోవడంతో ఆయన సినిమాలు ఆలస్యమవుతున్నాయి. పవన్ పార్ట్ టైమ్ పొలిటిషన్ అని ఇతర పార్టీ నేతలు విమర్శిస్తుంటే.. పార్టీ నడింపించాలంటే డబ్బులు కావాలి కదా అంటూ పవర్ స్టార్ గట్టిగా సమాధానం ఇస్తూ వస్తున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితిపై ఓ జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'మన నాయకుడు ఆయన సంపాదించినది అంతా పంచిపెట్టారు. ట్యాక్స్ కట్టేందుకు నా కళ్ల ముందే 5 కోట్ల రూపాయలు అప్పు చేశారు..' అంటూ ఆయన చెప్పిన మాటలు వీడియో క్లిప్‌ను జనసైనికులు తెగ షేర్ చేస్తున్నారు. తమ నాయకుడి గొప్పతనానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటందని అంటున్నారు.
ఈ మాట వినగానే తెలియకుండా కంట్లో నీళ్ళు తిరిగాయి 🥹🥹🥹
పవన్ కళ్యాణ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/j0RRWM6M1I— Prasannakumar Nalle (@PrasannaNalle) December 9, 2022
అయితే ట్యాక్స్ కట్టేందుకు జనసేనానిని నిజంగానే అప్పు చేశారా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోపై జనసేన పెద్దలు ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.
ఇక ప్రస్తుతం ఏపీలో జనసేన ప్రచారం రథం వారాహి వాహనం రంగుపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప.. ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ ఉపయోగించకూడదని అంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు చెబుతున్నారు. ఈ కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.
'కారు టు కట్‌డ్రాయర్.. వైసీపీ టిక్కట్ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వలన కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్..' అంటూ ఆయన వ్యగ్యంగా ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: Ind Vs Ban: మళ్లీ టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. రెండు కీలక మార్పులతో భారత్ బరిలోకి..
Also Read: YSRCP Twitter: వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పిచ్చి పిచ్చి ట్వీట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook