OG Time Begins: పవన్ అభిమానులకు సినిమాల పరంగాను.. రాజకీయపరంగానూ ఒకేసారి పండగ వచ్చింది.. ఇప్పటికే పవన్ అభిమానులు.. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సునామీని సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఈ క్రమంలో ఓ జి సినిమా యూనిట్.. వారికి మరో శుభవార్తను అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎలక్షన్స్ వల్ల అన్ని చిత్రాల షూటింగ్స్ పెండింగ్లో పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలలో.. ఆయన అభిమానులకు ఎక్కువగా అంచనాలు ఉన్న సినిమా ఓజి. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు ఈ చిత్ర పోస్టర్ విడుదల చేసి పవన్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టారు చిత్ర యూనిట్. ఇందులో మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే.. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా కూర్చో ఉండగా.. ఓజీ టైం బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చేసారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు.. ఈ పోస్టర్ కరెక్ట్ గా సెట్ అయిపోతుందని.. పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


 కాగా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 27, 2024న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.


 



 


Also read: Vijayawada Lok Sabha Election Result: విజయవాడలో విజయం ఎవరిది అన్నదా తమ్ముడిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook