Renu Desai Divorce : మళ్లీ దొరికిపోయిన పవన్ కళ్యాణ్.. భరణంపై రేణూ దేశాయ్ అలా.. పవర్ స్టార్ ఇలా
Renu Desai After Divorce పవన్ కళ్యాణ్ నుంచి రేణూ దేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత ఒంటరిగా ఉంటోన్న సంగతి తెలిసిందే.తనది తాను సంపాదించుకుంటూ బతికేస్తోంది.
Pawan Kalyan Renu Desai Alimony Asset : పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా ముందుకు వచ్చిన తన లెక్కలన్నీ బయటపెట్టేశాడు. తాను ఇంత వరకు ఎంత
సంపాదించాడో.. జన సేన కోసం ఎంత ఖర్చు పెట్టాడో.. ఇంకా ఎంత మిగిలి ఉందో.. విరాళాల ద్వారా ఎంత వచ్చిందో.. తాను ఎంత ఫండ్ విరాళంగా ఇచ్చాడో ఇలా లెక్కలన్నీ విప్పి చెప్పేశాడు. అనంతరం తన మూడు పెళ్లిళ్ల గురించిస్పందించాడు.
వైసీపీ వాళ్లు ప్రతీసారి తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారని.. మీక్కూడా చేసుకోవాలని ఉంటే.. చేసుకోండని చురకలంటించాడు. ఒక పెళ్లి చేసుకుని ముప్పై స్టెప్నీలను మెయింటైన్ చేసే మీరా? నన్ను అనేది అంటూ విరుచుకుపడ్డాడు. ఇక తాను మూడు పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడో చెప్పాడు. విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకున్నాను.. మీరు కూడా కావాలంటే చేసుకోండని కౌంటర్లు వేశాడు.
మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చాను.. విడాకులు తీసుకున్నాను.. రెండో భార్యకు నా ఆస్థి ఇచ్చాను.. మూడో పెళ్లి చేసుకున్నాను.. అంటూ ఇలా చెప్పుకుంటూ పోయాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ రేణూ దేశాయ్ విషయంలో పవన్ కళ్యాణ్ అబద్దం చెప్పినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తాను భరణంగా ఏమీ తీసుకోలేదని నాడు రేణూ దేశాయ్ చెప్పింది.
భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, బయటకు వచ్చేశాను అని రేణూ దేశాయ్ అనేసింది. ఆ మధ్య ఒకసారి రేణూ దేశాయ్, తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఓ లగ్జరీ ఇళ్లు కొనిచ్చాడనే వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ దేశాయ్ బాధపడింది. అది పవన్ కళ్యాణ్ కొనివ్వలేదని, తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోనే కొనుక్కున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు భరణం మీద చేసిన కామెంట్లతో.. చర్చ మొదలైంది. అంటే నాడు రేణూ దేశాయ్ అబద్దం చెప్పిందా? లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబద్దం చెప్పాడా? అనే చర్చ మొదలైంది. మరి వీటిపై రేణూ దేశాయ్ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Pawan Kalyan Remuneration : బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ ఆఫీస్.. పవన్ కళ్యాణ్
Also Read : Anasuya Bharadwaj : ఫ్లైట్‌లో డ్రెస్ చిరిగిందట.. విమానాయాన సంస్థపై అనసూయ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook