Pawan kalyan: వకీల్‌సాబ్ ఎప్పుడొచ్చేది ఫిక్స్ అయిపోయింది..ఇక పండగే ఫ్యాన్స్‌కు
Pawan kalyan: జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. అతని రీ ఎంట్రీ మూవీ డేట్ ఫిక్స్ అయింది. వకీల్‌సాబ్ వచ్చే తేదీ దాదాపుగా నిర్ణయమైపోయింది.
Pawan kalyan: జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. అతని రీ ఎంట్రీ మూవీ డేట్ ఫిక్స్ అయింది. వకీల్‌సాబ్ వచ్చే తేదీ దాదాపుగా నిర్ణయమైపోయింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star pawan kalyan ) అభిమానులు ఆసక్తిగా..ఆతృతతో ఎదురుచూస్తున్న వకీల్‌సాబ్ ఎప్పుడొచ్చేది తెలిసిపోయింది. జనసేన పార్టీ స్థాపన అనంతరం సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్..మళ్లీ తెరంగ్రేటం చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం వకీల్‌సాబ్ అవతారమెత్తాడు. దిల్‌రాజు ( Dil Raju ) - బోణి కపూర్ ( Boney kapoor ) నిర్మిస్తున్న వకీల్‌సాబ్ చిత్రం ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంది.
వకీల్‌సాబ్ ( Vakeel saab ) చిత్రంతో పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) రీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్ ( Lockdown )కు ముందే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తరువాత షూటింగ్ ఆగిపోయింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో వేగంగా షూటింగ్ జరుపుకుని అనుకున్న ముహూర్తం కంటే ముందే పూర్తి చేశారు.
ప్రస్తుతం యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక రిలీజ్ ఒక్కటే మిగిలింది. వేసవి సెలవుల్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 9 వ తేదీన వకీల్‌సాబ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా..దాదాపుగా రిలీజ్ డేట్ ఇదేనని సమాచారం.
Also read: Urvashi rautela: ఆమె రేటు ఎంతో తెలుసా..15 నిమిషాల కోసం..తెలిస్తే మైండ్ బ్లాక్