Pawan Kalyan starrer Hari Hara Veera Mallu Movie Poster Out: 'పవర్‌ స్టార్' పవన్ కళ్యాణ్ తాజాగా న‌టించిన 'భీమ్లానాయ‌క్' సినిమా ఇటీవల విడుద‌లై మంచి విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనంతరం జనసేన పార్టీ కోసం కొంత సమయం వెచ్చించిన పవన్.. ఇప్పుడు సినిమాల‌పై పూర్తి దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం పవర్‌ స్టార్ నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టారు. అందులో ఒకటి 'హ‌రిహ‌ర వీర మ‌ల్లు'. క్రిష్ జాగ‌ర్ల‌మూడీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు (ఏప్రిల్ 10) శ్రీరామ నవమి సందర్భంగా 'హ‌రిహ‌ర వీర మ‌ల్లు' చిత్ర మేకర్స్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. పవన్‌ లుక్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా 'హరిహర వీర మల్లు' సెట్‌లో చిత్రబృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్, క్రిష్.. రాముడి చిత్ర పటం వద్ద కొబ్బరికాయలు కొట్టి దీవనెలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.



పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్కుతున్న 'హరిహర వీర మల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇక సినిమాకు ఎమ్‌ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌కు మరోసారి పదును పెడుతున్నారు. పవన్, క్రిష్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 


Also Read: Sitara Dance: తొలిసారి కూచిపూడి డ్యాన్స్‌ చేసిన సీతూ పాప.. ఆనందం వ్యక్తం చేసిన సూపర్ స్టార్!


Also Read: Virat Kohli: థర్డ్ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి.. మైదానంలోనే బ్యాట్‌తో.. (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook