Pawan Kalyan to attend Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన లాల్ అనే నటుడు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద విపరీతమైన ఆసక్తి పెంచేసింది.


అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరో తేదీన ఒంగోలు వేదికగా జరగబోతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రకటించారు. మా బావ మనోభావాలు అనే సాంగ్ రిలీజ్ సందర్భంగా సాంగ్ రిలీజ్ చేస్తూనే మరో పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.


ఇటీవల నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతుండగా అదే అన్నపూర్ణ స్టూడియోకి హరిహర వీరమల్లు షూటింగ్ నిమిత్తం వచ్చిన పవన్ కళ్యాణ్ వెళ్లి నందమూరి బాలకృష్ణ కలిసి ఒక అరగంట పాటు ముచ్చటించి వచ్చారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది కాబట్టి వారు పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కమ్మని కోరారని పవన్ కళ్యాణ్ కూడా వస్తానని మాట ఇచ్చారని తెలుస్తోంది.


వాస్తవానికి 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అలవైకుంఠపురంలో అనే సినిమాలు పోటీపడ్డాయి. ఆ సమయంలో చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ కి హాజరు కాకుండా మహేష్ బాబు పిలిచాడు కదా అని సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి హాజరయ్యారు. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా వీర సింహారెడ్డి ఈవెంట్ కి హాజరు కాబోతున్నారని తన అన్నయ్య వాల్తేరు వీరయ్య అనే సినిమాతో అదే సంక్రాంతికి వస్తున్నా సరే మేకర్స్ కోరడంతో ఆయన ఈ సినిమా ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.


Also Read: Mythri Movie Makers Love: చిరు వద్దు బాలయ్య ముద్దు.. మైత్రీ వారి సవతి ప్రేమ నిజమేనా?


Also Read: Chalapathi Rao Died : చికెన్ బిర్యానీ తిని వెంటనే చనిపోయారు.. అసలు విషయం బయటపెట్టిన రవిబాబు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.