Ustaad Bhagat Singh First Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ అనే సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అప్పట్లోనే అనేక రికార్డులు బదులు కొట్టింది. అలాంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి మరో సినిమా చేస్తున్నారు.


Also Read: Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?



ముందుగా వీరిద్దరూ కలిసి భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుందని అందరూ భావించగా అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ కావడం దాని ప్లేస్ లోకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే కొత్త సినిమా వచ్చి చేరడం అందరికీ విదితమే.


తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తేరీ అనే సినిమాని తెలుగు నేటివిటికి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేసి కొత్త కథ పుట్టించిన హరీష్ శంకర్ ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. 


భగవద్గీత శ్లోకాలతో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ లో ఎప్పుడైతే అన్యాయాన్ని ఎదిరించాల్సిన అవసరం పడుతుందో అప్పుడు ప్రతి యుగంలోనూ ఒక అవతార పురుషుడు జన్మిస్తాడు అంటూ చెబుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. భీమ్లా నాయక్ లుక్ లోనే కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ భగత్ అనే పేరు గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ గ్లింప్స్ లో హీరోయిన్ శ్రీలీలను పెద్దగా ఫోకస్ చేయలేదు. ఒకే ఒక షాట్లో ఆమెను వెనుక నుంచి చూపించారు. ఇక ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు , బాక్సులు బద్దలై పోతాయి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.
Also Read: Mannara Chopra Photos: 'థార్' ఎక్కి మన్నారా చోప్రా అందాల విందు.. థైస్ షోతో రచ్చోభ్యహ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook