పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న అప్‌కమింగ్ సెన్సేషన్ వకీల్ సాబ్ మూవీ రిలీజ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ స్టేజ్‌లో ఉంది. పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో ఆలస్యమైంది. కరోనా కారణంగా అనుకున్న సమయానికి రాలేకపోయినా.. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోనైనా ( Sankranthi 2021 ) వకీల్ సాబ్ నిలుస్తుందని పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఆశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పవన్ కల్యాన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఎప్పటికప్పుడు ఈ సినిమా విడుదల వాయిదాల బాట పడుతోంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న తర్వాత అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ టాక్ వినిపించింది. కానీ తాజాగా ఆ తేదీని కూడా వాయిదా వేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Also read : Pawan Kalyan వకీల్ సాబ్ మూవీ స్టిల్స్ వైరల్


వకీల్ సాబ్ మూవీని ఏప్రిల్ 9న విడుదల చేసేందుకు ( Vakeel Saab release date ) దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. క్రాక్, రెడ్ లాంటి సినిమాలు సంక్రాంతి పండగకే విడుదల అవుతుండగా.. వకీల్ సాబ్ కోసం వేసవి సెలవులే సరైన సమయం అని దిల్ రాజు ( Dil Raju ) భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం సంక్రాంతి నాటికే కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావం పూర్తిగా పోదని.. అటువంటి సమయంలో సినిమా విడుదల చేస్తే బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై నెగటివ్ ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే దిల్ రాజు ఇలా సమ్మర్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేసినట్టు టాలీవుడ్ టాక్.


Also read : Pawan Kalyan in Sarkaru vaari pata: మహేష్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook