Pawan Kalyan in Sarkaru vaari pata: మహేష్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని ఉన్న వాళ్లకు త్వరలోనే వారి కోరిక తీరనున్నట్టు ఫిలింనగర్ టాక్.

Last Updated : Dec 6, 2020, 07:46 AM IST
Pawan Kalyan in Sarkaru vaari pata: మహేష్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని ఉన్న వాళ్లకు త్వరలోనే వారి కోరిక తీరనున్నట్టు ఫిలింనగర్ టాక్. అవును మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో పవన్ కల్యాణ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సర్కారు వారి పాట క్లైమాక్స్ సన్నివేశంలో సూపర్ స్టార్‌తో పవర్ స్టార్ కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. 

సర్కారు వారి పాటలో క్లైమాక్స్ సీన్‌లో ( Sarkaru vaari pata movie climax ) పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని భావించిన ఆ చిత్ర దర్శకుడు పరశురాం.. ఆయనకు స్క్రిప్ట్ వినిపించాడని.. మహేష్ బాబుతో ఉన్న మంచి స్నేహం కారణంగా ఈ విషయంలో పవన్ కల్యాణ్ సైతం ఆసక్తి చూపించినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. గతంలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఒకరికొకరు నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

Also read : Bigg Boss 4 Telugu finals: బిగ్ బాస్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ?

మహేష్ బాబు ( Mahesh Babu ) నటించిన అర్జున్ సినిమా పైరసీ బారిన పడినప్పుడు పవన్ కల్యాణ్ ఆ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ పైరసిని అరికట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పి మహేష్ బాబు తన స్నేహభావాన్ని చాటుకున్నారు. అలా పవన్ కల్యాణ్, మహేష్ బాబుల మధ్య మంచి స్నేహ బంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని కోరుకునే వారి సంఖ్యకు కూడా కొదువే లేదు. ఒకవేళ పవన్ కల్యాణ్ సర్కార్ వారి పాట మూవీలో ( Pawan Kalyan in Sarkaru vaari pata ) నటిస్తే.. వాళ్లందరి కోరిక నెరవేరినట్టే.

Also read : Pawan Kalyan: పిల్లల‌తో ప‌వ‌న్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News