Payal Rajput: ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం టైం కేటాయిస్తా.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్
Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.
Prabhas-Payal Rajput: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు విన్నాము. కానీ అందులో ఏది నిజం కాలేదు. తాజాగా ప్రభాస్ స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. "డార్లింగ్స్ ఫైనల్లీ మన జీవితాల్లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ దాకా బాగానే ఉంది. మరొకవైపు ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాపులర్ అయిన పాయల్ రాజ్ పుత్ ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. "నేను కూడా ఒకరికి డార్లింగ్ ని. ఎవరికో గెస్ చేయండి" అంటూ ఆమె పోస్ట్ చేసింది.
దీంతో ప్రభాస్ చెప్పాలి అనుకున్నది పాయల్ రాజు పూత్ గురించేనా అని టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ మధ్య ఎప్పటినుంచో సీక్రెట్ ప్రేమాయణం నడుస్తుంది అని ఇండస్ట్రీలో పుకార్లు గుప్పుమన్నాయి. తాజాగా పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.
“నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆదివారాలు నేను సపరేట్ గా ప్రభాస్ గారి కోసం టైం కేటాయిస్తాను. ప్రభాస్ ను కలిస్తే అతని కోసం నేనే స్వయంగా వంట చేసి పెడతాను. ప్రభాస్ ఏ ఫుడ్ అడిగితే అది అరేంజ్ చేస్తాను. రాజ్మా రైస్ నా ఫేవరేట్ ఫుడ్. ఛాన్స్ వస్తే అది వండి నా చేత్తో ప్రభాస్ కి తినిపిస్తాను" అని సిగ్గుపడుతూ చెప్పింది పాయల్.
ఏదేమైనా ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఇన్ డైరెక్ట్ గా చేస్తున్న కామెంట్స్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని సోషల్ మీడియా మొత్తం అనుకునేలా చేస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ప్రభాస్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త బయటకు వస్తే అది ఫాన్స్ కి కూడా పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..
ఇదీ చదవండి: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter