AP Weather Forecast: మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించిన ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఏపీలోని కొన్ని జిల్లాల్లో గత రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యదికంగా 50.5 మిల్లీమీటర్లు,, నెల్లూరు జిల్లా ఓలేటిపాలెంలో 48.5 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా నందికొట్కూరులో 47.3 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 27 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక వర్షాల కారణంగా వాతావరణం దాదాపుగా చల్లబడింది. కర్నూలులో నిన్న అత్యధికంగా 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
Also read: High Security To Chandrababu:బాబు భద్రత పెంపు ఫలితాలకు ముందే బిగ్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook