Payal Rajput Likes Photography ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందు పాత్రలో పాయల్ రాజ్‌పుత్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. హీరోయిన్‌ను నెగెటివ్‌గా చూపించడంతో అంతా షాక్ అయ్యారు. ఆ పాత్రను ఆమె పోషించిన తీరు, కనిపించిన తీరు, తెరపై అందాల ప్రదర్శించిన తీరుకు అంతా షాక్ అయ్యారు. అయితే పాయల్‌కు ఓవర్ నైట్‌లో క్రేజ్ వచ్చింది. తెలుగులో ఎంట్రీతోనే స్టార్ స్టేటస్ వచ్చింది. కానీ అంతకు ముందు పంజాబీ ఇండస్ట్రీ, బాలీవుడ్‌లో ఎన్ని సీరియల్స్, సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు పాయల్‌ కేవలం తెలుగు ప్రాజెక్టులను మాత్రమే చేస్తోంది. కరోనా కంటే ముందు పాయల్‌కు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగులోనూ ఆమెకు అవకాశాలు తగ్గినట్టుగా అనిపిస్తోంది. జిన్నా సినిమానే చాలా గ్యాప్ తరువాత వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం పాయల్ అందాలకు కూడా గుర్తింపు రాలేదు. సన్నీ లియోన్ ముందు పాయల్ తేలిపోయింది. కరోనా సమయంలో అనగానగా అతిథి అంటూ ఓటీటీలో సందడి చేసింది.


 



అందులో పాయల్ నటన బాగానే ఉంది. కానీ అందరినీ ఆ చిత్రం మెప్పించలేకపోయింది. ఇక పాయల్ సినిమాలకు రావడం తగ్గిపోయాయి. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతూ ఉంది. అతనితో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఉంటోంది. ఈ మధ్య పాయల్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ బాగానే హిట్ అయినట్టుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాయల్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.


తాజాగా పాయల్ ఓ పోస్ట్ చేసింది. అందులో తాను ఓ పోజు పెట్టింది. బ్యాక్ నుంచి ఆ ఫోటోను తీశారు. నాకు ఈ యాంగిల్‌లో ఫోటో దిగడం అంటే చాలా ఇష్టం.. నీకు పర్ఫెక్ట్ మూమెంట్లను ఎలా క్యాప్చర్ చేయాలో బాగా తెలుసు తన ఫోటో గ్రాఫర్ గురించి చెప్పుకొచ్చింది పాయల్. ప్రస్తుతం ఈ ఫోటో, ఆ క్యాప్షన్ రెండూ వైరల్ అవుతున్నాయి.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook