Pelli sandaD trailer: దసరాకు హోల్ సేల్ అల్లుడి హంగామా...సూపర్ స్టార్ వదిలిన `పెళ్లి సందD` ట్రైలర్..
Pelli sandaD Movie trailer: రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు.
Pelli sandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) హీరోగా, శ్రీలీల(Sri leela) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా 'పెళ్లి సందD'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. గతంలో శ్రీకాంత్(Srikanth) నటించిన ‘పెళ్ళిసందడి(Pelli Sandadi Movie)’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఇప్పటికే విడుదలైన పెళ్లి సందD(Pelli sandaD) సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Maheshbabu) చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చూశారు. పెళ్లి సందడి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మహేష్ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. రాఘవేంద్రరావు(Raghavendra Rao) మొదటిసారి నటిస్తున్న పెళ్లి సందడి సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తునందుకు చాలా సంతోషంగా ఉందని సూపర్ స్టార్ అన్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook