Pizza 2 Trailer in Telugu: పిజ్జా 2 ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఉప్పెన మూవీ తర్వాత తెలుగు ఆడియెన్స్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరుగా మారిన తమిళ నటుడు విజయ్ సేతుపతి, గాయత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమానే పిజ్జా 2 మూవీ. 2012లో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ పిజ్జా మూవీకి కొనసాగింపుగా పిజ్జా -2 సీక్వెల్‌ను తెరకెక్కించారు. అయితే, కథ, కథనంలో పిజ్జా మూవీకి, పిజ్జా 2 మూవీకి సంబంధం ఉంటుందా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాకపోతే పిజ్జా మూవీలాగే ఇది కూడా సస్పెన్స్ థ్రిలర్ అని పిజ్జా 2 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిజ్జా ఫస్ట్ మూవీలో విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా నటించగా ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి సరసన గాయత్రీ శంకర్ (Actress Gayathrie Shankar) ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. పిజ్జా 2 మూవీలో మరో మార్పు ఏంటంటే.. ఈ సీక్వెల్ పార్టుని ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కాకుండా రంజిత్ జయకోడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తుండగా.. ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆహా (movies on Aha) సెప్టెంబర్ 3న స్ట్రీమ్ చేయనుంది. 



Also read : Tuck Jagadish Trailer: అంచనాలు పెంచిన టక్ జగదీష్ ట్రైలర్


గతంలో ప్రేమ కథా చిత్రమ్ (Prema katha chitram) లాంటి సస్పెన్స్, హారర్, కామెడిని నిర్మించిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్.. పిజ్జా 2 మూవీతో మరోసారి అలాంటి సక్సెస్ అందుకుంటామనే ధీమాతో ఉంది. మరి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వారి అంచనాలను అందుకుంటాడా లేదా తెలియాలంటే పిజ్జా 2 మూవీ (Pizza 2 Telugu movie) విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.


Also read : Jabardasth Avinash Engagement photos gallery: ఎంగేజ్మెంట్‌తో సడెన్ షాకిచ్చిన ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook