PM Narendra Modi biopic Vishwa Netha: గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత దేశ ప్రధానిగా రెండు సార్లు దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన భారతీయు ప్రియతమ నేత నరేంద్ర మోదీ. వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముచ్చటగా మూడోసారి భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం" అనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తోన్న సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత" పేరుతో అన్ని భారతీయ భారతీసయ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు జాతీయ అవార్డు గ్రహీత కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జి.ఎస్.టి, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సాహసోపేత సంచలనాల నిర్ణయాలతో  కోట్లాది భారతీయుల గుండెల్లో ప్రధాన మంత్రి కొలువ దీరారు. త్వరలో "యూనిఫామ్ సివిల్ కోడ్", వన్ నేషన్ వన్ ఎలక్షన్, మెజారిటీ ప్రజలపై మెడపై కత్తిలా వేలాడుతున్న అనేక దుష్ట చట్టాలను నిర్మూలించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా  నరేంద్రుడి బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది.


గతంలో నరేంద్ర మోదీ జీవితంపై 'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్ తెరకెక్కనుంది. 2019 ఎలక్షన్ సందర్భంగా ఈ మూవీ విడుదలైంది. అందులో వివేక్ ఓబెరాయ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటించారు. అటు నరేంద్ర మోదీ జీవితంపై ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందిన సంగతి తెలిసిందే కదా.


Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook