Allu Arjun Birthday: `దేశముదురు రీ రిలీజ్`.. బన్నీ అభిమానుల అత్యుత్సాహం.. షోను నిలిపివేసిన పోలీసులు
Allu Arjun Fans Over Action: అల్లు అర్జున్ అభిమానుల అత్యుత్సాహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులను ఇతర హీరోల అభిమానులు ఎంతగా ట్రోల్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. తాజాగా వీరు చేసిన పనితో నెట్టింట్లో నానా హంగామా జరుగుతోంది.
Allu Arjun Birthday: అల్లు అర్జున్ అభిమానుల అత్యుత్సాహం పీక్స్‌కు చేరుకుంది. బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా దేశ ముదురు సినిమాను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. పైగా రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాను మళ్లీ విడుదల చేస్తే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. అందుకే దేశ ముదురు సినిమాను రంగంలోకి దించారు.
అయితే దేశ ముదురు సినిమాకు అనుకున్నంతగా ఆదరణ దక్కడం లేదు. ఈ సినిమాను చాలా చోట్లనే వేశారు. కానీ ఎక్కువగా హౌస్ ఫుల్ అవ్వడం లేదు. కొన్ని చోట్ల అది కూడా కొన్ని షోలు మాత్రమే ఫుల్ అవుతున్నాయి. ఇంకా చాలా థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. బుక్ మై షోలో చూస్తే ఇంకా చాలా షోలు గ్రీన్ కలర్‌లోనే చూపిస్తున్నాయి. అంటే ఈ సినిమాను ఆరెంజ్ రేంజ్‌లో క్రేజ్ దక్కలేదనిపిస్తోంది.
అయితే బన్నీ అభిమానులు మాత్రం సంధ్య థియేటర్లో కాస్త హడావిడి చేసినట్టుగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్లో సినిమాను ప్లే అవుతుండగా.. అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. థియేటర్లోనే టపాసులు పేల్చారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌కు చుక్కెదురైంది. పోలీసులు వచ్చి మధ్యలోనే షోను ఆపేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎస్‌కేఎన్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వారిని నువ్వే పంపించి హడావిడి చేయించి ఉంటావ్ కదా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Also Read: Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్
పూరి జగన్నాథ్ పోకిరి తరువాత చేసిన సినిమాగా దేశముదురు భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అప్పటికే పాటలు బాగానే పాపులర్ అవ్వడంతో సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే కథ సాదాసీదాగా ఉండటంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా బన్నీ డ్యాన్సులు, సిక్స్ ప్యాక్ లుక్, యాక్టింగ్, పాటలు, పూరి మార్క్ హీరోయిజం సినిమాను నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా మెప్పించింది దేశ ముదురు.
Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook