Ponniyan Selvan 1 Movie First Review By Umair Sandhu: తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలి సినిమాగా భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష వంటి వారు నటిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదీకాక స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మీద అన్ని భాషల ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం అన్ని భాషల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి సినిమాను తాను ముందే చూసేశానని దాదాపుగా చాలా సినిమాలకు అద్భుతంగా ఉందని రేటింగ్స్ కూడా ఇచ్చే దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సంధూ తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఒక ఫస్ట్ రివ్యూ పోస్ట్ చేశారు.


ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా సూపర్ గా ఉందని చెప్పుకొచ్చారు. విఎఫ్ఎక్స్ అయితే మరింత అద్భుతంగా కుదిరాయని చియాన్ విక్రమ్, కార్తీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటారని ఐశ్వర్యరాయ్ బచ్చన్ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చేసిందని ఆయన పేర్కొన్నారు. ఐశ్వర్య సినిమా మొత్తం మీద అద్భుతంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. అనేక ట్విస్టులతో చప్పట్లు కొట్టి అద్భుతమైన సీన్లతో సినిమా సాగుతుందంటూ ఆయన కామెంట్ చేయడంతో దానికి మణిరత్నం భార్య నటి సుహాసిని ఆసక్తికరంగా కామెంట్ చేశారు.


Suhasini ManiRatnam Counter to Umair Sandhu: అసలు విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు? మీరు ఎవరు? అంటూ ఆమె కామెంట్ చేశారు. దానికి కొంతమంది అతను ఏ సినిమా చూడడు కానీ చూసినట్లుగా బిల్డప్ ఇస్తూ కామెంట్లు చేస్తుంటాడని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం అతను దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు అని ప్రతి దేశం కూడా సెన్సార్ అయిన తర్వాతే సినిమాలను విడుదల చేస్తారు కాబట్టి అతను అలా ముందే సినిమాలు చూస్తాడని కామెంట్ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.


Also Read: Mahesh Babu House: హాస్పిటల్లో మహేష్ బాబు.. ఇంట్లో దూరిన దొంగ.. వెలుగులోకి షాకింగ్ ఘటన!


Also Read: Allu Studios By Chiranjeevi: మెగాస్టార్ చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ఓపెనింగ్.. ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook