Pooja Hegde about Acharya : మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌ హీరోలుగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నీలాంబరి పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రంలో తన పాత్ర గురించిన విశేషాలు పంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆచార్య చిత్రంలో పూజా నీలాంబరి పాత్రలో నటిస్తోంది. గత చిత్రాల్లో పోషించిన గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఆచార్యలో ఓ గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది పూజా హెగ్డే. ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ చెప్పగానే అంగీకరించినట్లు తెలిపింది పూజా. కొరటాల కథ చెప్పగానే అదో అందమైన కథలా అనిపించిదని పేర్కొంది పూజా. అందులో నటించాలని తనకు వెంటనే అనిపించిందని, నీలాంబరి పాత్ర జీవితంలో మరచిపోలేనిదని చెప్పుకొచ్చింది.


చరణ్‌తో షూటింగ్‌ చాలా ఎంజాయ్ చేశానంది పూజా హెగ్డే. చరణ్ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారని, చరణ్‌ ఎంతో స్వీట్‌ పర్సనాలిటీ అని, మృదు స్వభావి అని పొగడ్తల వర్షం కురిపించింది పూజా.


మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అంది పూజా. తనతో ప్రతి ఒక్కరూ నటించాలని కోరుకుంటారంది పూజా. చిరంజీవి అంటేనే నవరసాలు కలబోసిన ఓ అద్భుత నటుడని కొనియాడింది. చిరంజీవి సెట్స్‌లో కూర్చున్నప్పుడు తనదైన స్టైల్‌ కనిపిస్తుందని, అతని నుంచి కొంతైనా తనకు రావాలని కోరుకుంటున్నానని పేర్కొంది పూజా.


దర్శకుడు కొరటాల శివ చాలా సైలెంట్‌గా ఉంటారని, ఆయన సీన్ చేసేటప్పుడు ఎంతో క్లియర్‌గా వివరిస్తారని తెలిపింది. తాను చూసిన దర్శకులందరిలోకెల్లా శివ అత్యంత కామ్‌గా ఉంటారని, తనతో మళ్లీ మళ్లీ కలిసి పని చేయాలని భావిస్తున్నానని పూజా తెలిపింది.


"ధర్మస్థలి సెట్‌లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు ఎంతో అమోఘంగా అనిపించింది. అది అసలు సెట్‌లా అనిపించలేదు. నిజంగా అలాంటి ప్రదేశం ఒకటి ఉందా అనేంత సహజంగా ఆ సెట్ రూపొందించారు. ధర్మస్థలి ఆలయంలో అడుగు పెట్టగానే ఒళ్లు పులకరించిపోయింది. రోమాలు నిక్కబొడుచుకునేలా అనుభూతి కలిగింది. ధర్మస్థలి సెట్ వేయటంలో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సెట్‌లోకి వెళ్లగానే అది మన సొంతింటిలా, సొంత ఊరిలా అనపిస్తుంది". -పూజా హెగ్డే


 



Also Read : Samantha Birthday: కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు... సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన సాయి ధరమ్ తేజ్...


Also Read : Chiranjeevi Acharya: పవన్ కల్యాణ్ కోసం 'ఆచార్య' మూవీ స్పెషల్ స్క్రీనింగ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.