Samantha Birthday: కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు... సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన సాయి ధరమ్ తేజ్...

Sai Dharam Tej Birthday Wishes to Samantha: ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెట్టింది సామ్. ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ తారలు ఆమెకు విషెస్ తెలియజేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 01:27 PM IST
  • ఇవాళ హీరోయిన్ సమంత పుట్టినరోజు
  • సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన సాయి ధరమ్ తేజ్
  • కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు విష్ చేసిన తేజ్
Samantha Birthday: కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు... సమంతకు బర్త్ డే విషెస్ చెప్పిన సాయి ధరమ్ తేజ్...

Sai Dharam Tej Birthday Wishes to Samantha: సాధారణంగా ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. గ్లామర్ ప్రపంచంలో చాలాసార్లు హీరోయిన్ల పాత్ర అందాల ప్రదర్శనకే పరిమితమవుతుంది. కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే అందంతో పాటు తమదైన నటనతో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పరుచుకుంటారు. అలాంటి హీరోయిన్లలో సమంత ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇవాళ సమంత 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ స్టార్స్ ఆమెకు విషెస్ తెలియజేశారు.

బహుశా అందరి కన్నా ముందు సమంతకు పుట్టినరోజు విషెస్ చెప్పింది మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఎగ్జాక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకు తేజ్ తన ట్విట్టర్ ఖాతా నుంచి సామ్‌కు విషెస్ చెప్పాడు. సామ్ అంటే తనకెంత అభిమానమో తెలియజెప్పాడు. 'జెస్సీ, నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు... వెరీ హ్యాపీ బర్త్ డే... ఇట్లు నీ వీరాభిమాని..' అంటూ ట్వీట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'కరెక్ట్‌గా రాత్రి 12గంటలకు విషె చేశావంటే మాటలా... ఫ్యాన్ పేజెస్ అనుకున్నా... అట్లుంటది తేజ్ అన్నతో..' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జరుపుకుంటున్న తొలి బర్త్ డే ఇది. ఇప్పటికైతే చై తన మాజీ భార్య సామ్‌కి బర్త్ డే విషెస్ చెప్పలేదు.

కాగా, 2010లో 'ఏం మాయ చేశావో' సినిమాతో సమంత సినీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో కలిసి నటించిన ఆ సినిమాలో జెస్సీగా సమంత నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత కొన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ... అవకాశం వచ్చిన ప్రతీసారి ప్రయోగాలకు కూడా వెనుకాడలేదు. ఆ క్రమంలోనే ఓ బేబీ, ది ఫ్యామిలీ మ్యాన్ వంటి చిత్రాల్లో తన పెర్ఫామెన్స్‌తో సమంత తానేంటో నిరూపించుకుంది. 

ప్రస్తుతం తెలుగులో శాకుంతలంతో పాటు యశోద సినిమాలో సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండతో  శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన 'కాతు వాకుల రెండు కాదల్' ఇవాళే (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Also Read: Covid 19 Fourth Wave: దేశంలో ఇప్పటికే 'ఫోర్త్ వేవ్' మొదలైంది.. ప్రతీ ముగ్గురిలో ఒకరిది ఇదే అభిప్రాయం...

Also Read: KGF 2: హిందీలో 'కేజీఎఫ్ 2' హవా... బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన రాకీబాయ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News